పేరుకు ఆ రెండు జాతీయ పార్టీలు కానీ. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ రెండు పార్టీలు యేటికి ఎదురీదుతున్నాయి. తెలంగాణలో ఆ రెండు పార్టీలు పోటీలో ఉన్నట్లే కన్పిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం వీటి ఉనికి అగమ్యగోచరంగా మారింది. కనీసం ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆ రెండు పార్టీలు ఏవో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవేనండి కాంగ్రెస్, బీజేపీలు. ఈ రెండు పార్టీలే కేంద్రంలో అధికారం…
బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఈరోజు లేదా రేపటిలోగా ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రావాలని పవన్‌ను కోరతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు కొనసాగుతుందని అన్నారు. పవన్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. విమర్శలు చేసేటప్పుడు…
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఉప ఎన్నిక హీట్ పెంచింది. వైసీపీ ఎమ్మెల్యే మృతితో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ షూరు అయ్యింది. అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ నుంచి మృతిచెందిన ఎమ్మెల్యే భార్యకే అధిష్టానం టికెట్ కేటాయించింది. టీడీపీ సైతం తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక జనసేన…
ఈ రోజు పశ్చిమ బెంగాల్ లో భబానీపూర్ కు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో అందరూ ఊహించినట్లే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. అనంతరం ఈ ఫలితాల పైన ఆవిడ స్పందిస్తూ… భబానీపూర్ లో దాదాపు 46 శాతం మంది బెంగాలీయేతరులు ఉన్నారు. వారందరూ నాకు ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు భబానీపూర్ వైపు చూస్తున్నారు. ఇది నాకు స్ఫూర్తినిచ్చింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు…
హుజురాబాద్ ఉపఎన్నికలో హోరాహోరీగా తలపడుతున్న టీఆర్ఎస్, బీజేపీ లెక్కలేంటి? ఎవరు ఏం అంశాలపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు? వారి అంచనాలు పోలింగ్ నాటికి వర్కవుట్ అవుతాయా? ఇన్నాళ్టి ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ సాధించింది ఏంటి? గడియారం గిర్రున తిరుగుతోంది. హుజురాబాద్‌లో పోలింగ్‌కు నెల రోజుల సమయం కూడా లేదు. పార్టీల వ్యూహాల స్పీడ్ పెరిగింది. ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. నాలుగు నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తిస్తోన్న ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు మరిన్ని శక్తులను మోహరిస్తున్నాయి.…
బద్వేలు ఉప ఎన్నికలును పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. జగన్ పార్టీ కి భయపడాల్సిన పని లేదని… బద్వేలు సమీపంలో రెండు జాతీయ రహదారులకు కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. జగన్, చంద్రబాబు ఈ ప్రాంతంలో ఎక్కడైనా రోడ్లు వేశారా… ఆంధ్రప్రదేశ్ ను ఏడు ఏళ్లుగా నరేంద్ర మోదీ నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాడని తెలిపారు..రాష్ట్రంలో ఏడేళ్ల అభివృద్ధి పై చర్చించడానికి బీజేపీ సిద్ధమని… జగన్, చంద్రబాబుకు దీనిపై చర్చించడానికి…
సెప్టెంబర్ 30 వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేశారు. బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటిగ్ జరుగుతున్నది. తాజా సమాచారం ప్రకారం తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 12 రౌండ్లు ముగిసే సరికి మమతా బెనర్జీ 35 వేల ఓట్ల మేజారిటీని…
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీతో పాటుగా ఎమ్మెల్యేపదవికి కూడా రాజీనామా చేయడంతో హుజురాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నట్టు బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించడంతో ఆ నియోజక వర్గంలో త్రిముఖపోటీ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ…
కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీపై క్లారిటీ ఇచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్. అనంతపురం జిల్లాలో పర్యటించిన పవన్ .. బద్వేల్ బై ఎలక్షన్స్‌లో తాము పోటీ చేయబోమని స్పష్టం చేశారు. తమది విలువలతో కూడుకున్న పార్టీయన్న జనసేనాని… సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన స్థానంలో అభ్యర్థిని నిలుపబోమని చెప్పారు. స్థానికంగా ఉండే జనసేన నాయకులతో చర్చించిన తర్వాతే.. పోటీపై నిర్ణయం తీసుకున్నామన్నారు పవన్ కల్యాణ్. మరణించిన ఎమ్మెల్యే భార్యకే.. టికెట్ ఇచ్చినందున జనసేన పోటీ…
చేతిలో అధికారం ఉండి అభివృద్ధి చేయాలనే బలమైన కోరిక ఉంటే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించవచ్చని నితిన్ గడ్కారి నిరూపించారని ఎన్సీపీ నేత శరద్ పవార్ పేర్కొన్నారు. ఈరోజు అహ్మద్ నగర్‌లోని ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కారీతో కలిసి వేదికను పంచుకున్న శరద్ పవార్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అహ్మద్ నగర్లో సుదీర్ఘకాలంగా అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని నితిన్ గడ్కారి ఈరోజు ప్రారంభించబోతున్నారని తెలిసి అక్కడికి వచ్చానని అన్నారు. నితిన్ గడ్కారి ఉపరితల…