కారెక్కనున్న మోత్కుపల్లి.. ముహూర్తం ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ పొలిటికల్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు.. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. గత కొంత కాలంగా ఆయన కారెక్కుతారు అనే ప్రచారం సాగుతోంది.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రభుత్వ పథకాలను సమర్థిస్తున్నారు.. ఇక, తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ను తెలంగాణ అంబేద్కర్‌గా అభివర్ణించారు.. మరోవైపు.. మోత్కుపల్లి.. టీఆర్ఎస్‌లో చేరడం.. ఆయనను దళిత బంధు ఛైర్మన్‌గా నియమించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి.. ఈ నేపథ్యలో ఈ నెల 18వ తేదీన టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు మోత్కుపల్లి.. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.. మోత్కుపల్లికి టీఆర్ఎస్ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించనున్నారు.. తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున అనుచరులతో గులాబీ కండువా కప్పుకోనున్నారు మోత్కుపల్లి.
కాగా, సీనియర్ పొలిటికల్ లీడర్ అయిన మోత్కుపల్లి నర్సింహులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. ఆయన సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు.. 1983లో తొలిసారి ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి సల్లూరు పోశయ్యపై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో టీడీపీలో చేరాడు. 1985లో ఆలేరు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి చెట్టుపల్లి కెన్నెడీపై గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక, 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పీవీ నరసింహారావు పై పోటీచేసి ఓడిపోయారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా టీడీపీతో గ్యాప్ వచ్చింది.. చంద్రబాబు వైఖరిని ఆయన తప్పుబట్టడంతో.. 2018, మే 28న ఆయనను బహిష్కరించింది తెలుగుదేశం పార్టీ.. ఇక, ఆయన 4 నవంబర్ 2019లో భారతీయ జనతా పార్టీలో చేరారు.. సీఎం కేసీఆర్ దళితబంధుపై నిర్వహించిన సమావేశానికి వెళ్లకూడదని బీజేపీ నిర్ణయించినా.. ఆయన ఆ సమావేశంలో పాల్గొని.. కేసీఆర్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు.. దీంతో బీజేపీతో కూడా గ్యాప్ వచ్చింది.. 23 జులై 2021న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 18వ తేదీన టీఆర్ఎస్‌లో చేరనున్నారు మోత్కుపల్లి.
Also Read
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!