ఈ రోజు హుస్నాబాద్‌లో బీజేపీ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ, తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్‌లో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతుందని, మద్యం ఏరులై పారుతోందని, ఇంత చేసినా తనను ఏమీ చేయలేకపోతున్నారని ఈటల పేర్కొన్నారు. అక్టోబర్ 30 న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలుస్తుందని, అన్ని జిల్లాల నుండి ఈటలను గెలిపించాలని…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ఇవాళ్టితో ముగియనుంది.. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో రోడ్ షో, ముగింపు సభ నిర్వహణకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రాబోతున్నారు.. మెత్తం 36 రోజుల పాటు 438 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేశారు బండి సంజయ్.. ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలను…
హర్యానాలో రైతులు..భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, జజ్జర్లో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను ఆపడానికి నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. అయితే… నల్ల జెండాలతో రైతులు ముందుకే సాగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు-రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల దగ్గర నెలల తరబడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ విధులకు…
సీఎం కేసీఆర్ ధర్మంతో గోక్కున్నారు.. మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. జమ్మికుంట మండలం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయానట.. ఎలానో చెప్పు మిత్రమా హరీష్ రావు అంటూ ప్రశ్నించారు.. పచ్చ కామెర్లవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు నేనే నామీద దాడి చేయించుకుని కట్టుకట్టుకొని వస్తా అని చెప్తున్నారు.. అలా చేసేది మీరే అని…
చాలా కాలంగా పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఈ కుమ్ములాటల కారణంగా అమరీందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. రాజీనామా చేసిన తరువాత ఢిల్లీ వెళ్లివచ్చిన ఆయన కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండటం లేదని చెప్తూనే, వచ్చే ఎన్నికల్లో సిద్ధూని ఒడించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరో 15 రోజుల్లోనే అమరీందర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తనకు అనుకూలంగా…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇవి ఒకరకంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సైమీఫైనల్. దీంతో అటూ కాంగ్రెస్, ఇటూ బీజేపీ తమ పట్టును కాపాడుకోనేందుకు శతవిథాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలో రావడంతో ఆపార్టీపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రధాని మోదీ ఇమేజ్ క్రమంగా దిగజారుతున్నట్లు కన్పిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు…
గత నాలుగురోజులుగా ఏపీలో వాద, ప్రతివాదాలతో రాజకీయాలు దిగజరాయి అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వుండి దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేయడం పలాయనవాదం. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం చెందింది. పేదప్రజల నడ్డివిరిచే విధంగా పాలన సాగతోంది. సినీరంగాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు అని తెలిపారు. జనసేన బీజేపీ కలిసి పని చేస్తాయి. రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదుగుతాము అని అన్నారు. ఇక…
పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సిద్ధూ అలక దిగివచ్చి పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ పదవిలో కొనసాగనున్నారు. అయితే, సిద్ధూ చెప్పిన విధంగా ప్రభుత్వంలో పాలన సాగితే మరోసారి అంతర్గత విభేదాలు బహిరంగమయ్యే అవకాశం ఉన్నది. కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ త్వరలోనే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక గురించి మాట్లాడారు. ఒకవేళ చీలిక…
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు ప్రధాన భూమిక పోషించనున్నారా? టీఆర్ఎస్కు గట్టి దెబ్బ వారి నుంచే తగలనుందా? షర్మిల పార్టీ నిరుద్యోగులను ఏకం చేసి టీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందా? రేపటి ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోషించబోయే పాత్ర గురించి రాజకీయ వర్గాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి నష్టం ఉండదని టీఆర్ఎస్ అంటోంది. మరోవైపు అది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగలను…
తెలంగాణలో ఈటల రాజీనామా తర్వాత రాష్ట్ర రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. అయితే నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు నుండి ఈనెల 8 వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక అభ్యర్థులు…