మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికను ఈటల రాజేందర్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇక్కడ మరోసారి గెలిచి సత్తాచాటాలని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగానే కమ్యూనిస్టు భావాలు కలిగిన ఈటల రాజేందర్ తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ కు…
ఏపీలో కొత్త పొత్తులకు బీజం పడిందా? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఆ దిశగానే వెళ్తున్నాయా? బద్వేలు ఉపఎన్నికలో పోటీ విషయమై మిత్రులు భిన్నదారులు వెతుక్కుంటే.. వేర్వేరు దారుల్లో ఉన్నవారు ఏకతాటిపైకి వస్తున్నారా? బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చిందా? ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. రిప్లబిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ తర్వాత పొలిటికల్ కలర్స్ ఎటెటో వెళ్తున్నాయి. వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ క్రమంలో బూతులు..…
మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్రావు.. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గెల్లు శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇళ్లు ఎలా వస్తాయి? గెల్లు శీను గెలిస్తే వస్తాయా..? ఈటల గెలిస్తే వస్తాయా? ఒక్కసారి ఆలోచించాలన్నారు.. గెల్లు సీను గెలవడం ఖాయం ఇక్కడ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామన్న ఆయన.. గొంతు బిగ్గరగా చేసుకొని పెద్దగా మాట్లాడిన జూట మాటలు మాట్లాడిన ధర్మం…
కేంద్ర రైతు చట్టాలకు వెతిరేకంగా చేస్తున్న ఆందోళనలో 450 మంది రైతులు అమరులయ్యారు. రైతులను నాశనం చేసినవాళ్ళు… రాజకీయ ఎదిగిన వాళ్ళు లేరు చరిత్రలో లేరు అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి రోజు శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతుల. పైకి కేంద్రమంత్రి కొడుకు అధికార దాహంతో నాలుగు రైతులను తిక్కి చంపారు. అజయ్ మిశ్రా మాటల వెనుక కేంద్ర హోమ్ అమిత్షా ఉన్నారు. అజయ్ మిశ్రాను అరెస్టు చేయడంలో…
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ… సామాజిక వర్గం తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు. మనం అనుకున్నది సాధించాలనే సత్తా సామాజికవర్గానికి ఉన్నది. క్యాడేట్లను చూసి కాదు కేసీఆర్ ను చూసి ఓటెయ్యండి అని అంటున్నారు.. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులను అవమానించిన కెసిఆర్ కు మామూలు ఎమ్మెల్యేలు ఓ లెక్కన అని తెలిపారు. అయితే తెలంగాణలో కేసీఆర్ డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయి డబ్బులు ఇచ్చి ఏమైనా చెయ్యొచ్చు అన్నమాటకు తెరదించాల్సింది…
హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి అంతకంతకు పెరగుతోంది. ఓ వైపు ప్రచార హోరు ..మరోవైపు నామినేషన్ల పర్వం. నామినేషన్ల గడువు కూడా దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్ దాఖలు చేశారు. కొంత కాలంగా ఆమె తన భర్త తరపున నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ఓటడుగుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులకు సీఎం కేసీఆర్ కీలక పదవి కట్టబెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.. తెలుగు దేశం పార్టీలో ఉండగానే టీఆర్ఎస్లో చేరేందుకు అప్పట్లో మోత్కుపల్లి ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది.. కానీ, ఆయనను పార్టీలో చేర్చుకోవడం కొందరికి ఇష్టం లేకపోవడంతో.. ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.. అయితే, సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించగానే.. పరిస్థితి మారిపోయింది… సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి వెళ్లొద్దని బీజేపీ నిర్ణయం…
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రారు.. దళితబంధు పథకంపై అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించారు.. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ లో మనం శాసించే కేంద్ర ప్రభుత్వం రావొచ్చు అన్నారు.. కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం పడొచ్చు.. లేకపోతే.. ఇప్పుడు ఉన్న కేంద్రమే మనల్ని కనికరించ వచ్చునని కామెంట్ చేశారు.. అనేక దఫాలుగా కేంద్రాన్ని నిధులు కూడా అడిగాం.. మీరు కూడా…
కరీంనగర్ అబాది జమ్మికుంట బీజేపీ పార్టీలో ఈ రోజు భారీగా చేరికల జరిగాయి. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేసారు ఈటల రాజేందర్. మీ డబ్బులకు, మీ మద్యం సీసాలకు నాగార్జునసాగర్ కోదాడలో రిజల్ట్ రావచ్చు. కానీ హుజురాబాద్ లో మాత్రం ఆత్మగౌరవానికే రిజల్ట్ వస్తుంది అని స్పష్టం చేసారు. ఆత్మగౌరవ ప్రతీక,పేదప్రజల గొంతుక ఈటల రాజేందర్. జమ్మికుంట పట్టణంలో ఎవరి ఫ్లెక్సీలు, ఎవరి ముఖాలు ఉన్నాయి. ఈటల ఫ్లెక్సీలు, జెండాల పెడితే…
బద్వేల్ ఉప ఎన్నికల్లో వింత పరిస్థితి నెలకొంది. వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే రెండు పార్టీలు తాజాగా ఈ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా భావిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేని పార్టీలు బరిలో నిలుస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓడిపోతామని తెల్సినా సదరు పార్టీలు పోటీకి దిగుతుండడం వెనుక మతలబు ఏంటా? అనే…