హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. రోజురోజుకు రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఊరూరా ఈటల రాజేందర్ కు ప్రజలు నీరాజనం పడుతున్నారని, ఈటల గెలుపు తథ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, హుజురాబాద్‌లో భారీ మెజార్టీతో ఈటల…
బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండగా అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. బద్వేల్ లో వైసీపీ గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తుండటంతో ఆపార్టీ భారీ మోజార్టీపై గురిపెట్టింది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ తమ్ముళ్లు మాత్రం ఎవరికీ ఓటు వేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. బద్వేల్…
హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికలు ప్రజలు కోరుకుంటే వచ్చినవి కావు. సోనియాగాంధీ నిర్ణయించిన అభ్యర్థి వెంకట్ ను హుజూరాబాద్ లో పెట్టారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. హరీష్ రావ్ కు సవాల్, పేదలకు డబుల్ బెడ్ రూం లు ఇస్తాం అన్నారు. ఏ ఊర్లో డబుల్ బెడ్ రూం ఇచ్చారో చెప్పండి.. ఇవ్వని గ్రామాలకు…
హుజురాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు టీఆర్ఎస్ పార్టీ బహిరంగ లేఖ పంపింది. దానికి సమాధానం చెప్పండి అని అడిగారు. నడి రోడ్డుపై రైతులను హత్య చేసి మళ్లి అరైతులనే ఓట్లు అడుగుతారా.. టీఆర్ఎస్ కు రైతులు ఎందుకు ఓటు వెయ్యలో వెయ్యి కారణాలు చెప్తా.. కానీ బీజేపీకి ఎందుకు రైతాంగం ఓటు వెయ్యలో కిషన్ రెడ్డి,బండి సంజయ్ చెప్పాలి అన్నారు.…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ప్రముఖ రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం…
హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ పై మాటల తూటాలు పేల్చారు. క్యాబినెట్లో ఉన్న వాళ్లలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు ఈ మధ్య కాంగ్రెస్ మీద ప్రేమ ఎక్కువైందన్నారు. భట్టి మంచోడు అంటాడు, మంచోడైన భట్టిని ప్రతిపక్ష హోదా నుంచి ఎందుకు తీసేశాడో సమాధానం చెప్పాలన్నారు. గాంధీ భవన్‌కు గాడ్సే రావడం కాదు టీఆర్ఎస్…
రాష్ట్రమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎక్కడికి వచ్చి మాట్లాడినా అందులో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి తప్పక ఉంటోంది. ఈ రోజు కేటీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్, పీసీసీ రేవంత్ రెడ్డిలు రహస్య ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్, ఈటల భేటీ…
హుజురాబాద్ బైపోల్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ను పెంచాయి. హుజురాబాద్ మండలం సింగాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వి అన్ని అబద్ధాలు, మోసాలేనని అన్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. మీటింగ్‌కి పోవద్దు అని డబ్బులు ఇచ్చే దుర్మార్గ పరిస్థితికి టీఆర్ఎస్ దిగజారిందన్నారు. పిల్లిని రూంలో వేసి కొడితే…
తిరుపతి కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ బీజేపీ, టీడీపీ, వైసీపీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకువస్తున్నా దేశ ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని.. దేశం ప్రమాదపు అంచుల్లో ఉందన్నారు. ప్రధాని అత్యంత ఆప్తుడి పోర్టులో రూ. 20 కోట్ల విలువ చేసే హెరాయిన్ దొరికితే అతన్ని అరెస్టు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లీటర్ డీజిల్ పై రూ. 50 ఉంటే, బీజేపీ హయాంలో రూ.100కుపైనే ఉందన్న ఆయన.. దేశంలో అభివృద్ధి…
హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారంలో వేడి పెరుగుతోంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ సిగ్గులేని రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దాడులకు దిగుతోందని బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ గెలిచే పరిస్థితే ఉంటే.. దాడులకు దిగుతుందా..? అని ప్రశ్నించారు. బీజేపీ ఫ్రెస్టేషన్లో ఉందని, కిషన్ రెడ్డి తన స్థాయిని మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. Read Also…