ఇద్దరు కార్పోరేటర్లపై బీజేపీ వేటు.. కారణం అదే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పోరేషన్ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ మేయర్ ఎన్నికలు బీజేపీలో చిచ్చురేపాయి. కాకినాడలో ఇద్దరు బీజేపీ మహిళా కార్పోరేటర్ల సస్పెన్షన్ వేటు వేసింది. నూతన మేయర్ ఎన్నికలో వైసీపీకి మద్దతు తెలిపిన 5వ వార్డు కార్పొరేటర్ సుజాత, 41వ వార్డు కార్పొరేటర్ సత్యవతి. విప్ ధిక్కరించడంతో ఇద్దరినీ సస్పెండ్ చేసింది బీజేపీ.
తాము జారీచేసిన విప్ ధిక్కరించడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు బీజేపీ క్రమశిక్షణా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పాకా సత్యనారాయణ. క్రమశిక్షణకు మారు పేరైన బీజేపీలో పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే ఏస్థాయిలో ఉన్నవారినైన ఉపేక్షించేది లేదని పార్టీ స్పష్టం చేసిందని వారిపైనా చర్యలు తప్పవన్నారు కాకినాడ పార్లమెంట్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
Read Also:కాకినాడ మేయర్‌గా శివప్రసన్న, డిప్యూటీగా ఉదయ్ కుమార్
టీడీపీ కైవసం చేసుకున్న కాకినాడ కార్పోరేషన్లో అసమ్మతి పరిణామాల నేపధ్యంలో మేయర్ సుంకర పావని పదవీచ్యుతురాలయిన సంగతి తెలిసిందే. సుంకర పావనిని మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వంగెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీవోఎంఎస్ నెంబర్ 129 ద్వారా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లోని సెక్షన్ 91/ఎ(6) ద్వారా ఉత్తర్వులిచ్చారు.
ఆమెతోపాటు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబును కూడా పదవి నుంచి తొలగించారు. అనంతరం కొత్త మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్పోరేషన్ కూడా వైసీపీ వశం అయింది. కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. బీజేపీ కార్పోరేటర్లు ఇద్దరు విప్ ఉల్లంఘించారు. దీంతో కఠినచర్యలకు ఉపక్రమించింది బీజేపీ.
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!