కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి… అసలు దళితులు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… వైసీపీ దళిత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దళితుల గురించి అవహేళనగా మాట్లాడిన ఆదినారాయణ రెడ్డిని బద్వేల్ ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు… దళితులకు నాగరికత లేదని మాట్లాడే ఆదినారాయణరెడ్డికి అసలు దళితుల ఓట్లు అడిగే హక్కులేదన్న ఆయన.. దళితులు ఎవ్వరూ బీజేపీకి…
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. మంగళవారం హుజురాబాద్ లో ఈటలకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్, హరీష్ రావు ల స్నేహం మధ్య చిచ్చు పెట్టింది కేటీఆర్ అని, ఓటమి భయంతో ఏదో ఒకటి చెప్పాలని కేటీఆర్ చెప్తున్నారన్నారు. సుమన్ భాష మార్చుకోవాలి మొనగాడు ఎవరో సీఎం కేసీఆర్ ను అడిగితే చెప్తాడన్నారు. మేము కాంగ్రెస్ లో ఎందుకు పోతం బీజేపీ బలోపేతానికి…
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారాల్లో వేగం, వేడి పెరుగుతోంది. మంగళవారం హుజురాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద స్కీంలకు ఇందిరానగర్- శాలపల్లి కేంద్రంగా మారిందన్నారు. శాలపల్లిలో దళితబంధు ఆరంభించి 65-66 రోజులైందని, ఈ స్కీం మొదటి ఇక్కడే లాంఛ్ చేయలేదని, భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభించారని గుర్తు చేశారు. దళితబంధు నేను వద్దన్నట్లు దొంగ ఉత్తరం…
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఆ రెండు విషయాల గురించి నోరుమెదపడం లేదని, దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, లడఖ్ లోని భారత భూభాగాన్ని చైనా అక్రమించిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదంటూ నిప్పులు చెరిగారు. కశ్మీర్ లో మన భారత సైనికులు ఉగ్రవాదుల చేతిలో చనిపోతుంటే.. పాకిస్థాన్ తో ఈ నెల 24న టీ20 క్రికెట్…
హుజురాబాద్ ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ రోజు ప్రచారంలో భాగంగా బీజేపీ,టీఆర్ఎస్ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు. జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారానికి ఇంకా కొన్ని రోజులే ఉండటంతో ఆయా పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఒకరినొకరు మాటలతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాటే పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్…
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఉద్ఘాటించారు. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకై హుజురాబాద్ లో రాజకీయం చేస్తున్నాయన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని…
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరవుతోంది. ప్రచారానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. పట్టుమని పది రోజులే మిగిలాయి. ఈ లోగా చేయాల్సిందంతా చేసే పనిలో ఉన్నారు నేతలు. ప్రచార ఉధృతి పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచారం హోరెత్తుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దసరా సంబరాలు ముగిశాయి. కానీ హుజూరాబాద్లో ఇంకా ముగిసినట్టు లేదు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం దసరాలాగే ఉంది. మరో…
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారు. మానవ సంబంధాలకు మచ్చ తీసుకు వస్తున్నారు. గొల్ల కురుమలకు గొర్లు నా రాజీనామా తరువాతనే… అది కూడ హుజూరాబాద్ మాత్రమే వచ్చాయి. అది మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్ల మీద ప్రేమ. పెద్దపల్లి ఎమ్మెల్యేకి టికెట్ నేనే ఇప్పించిన, గెలవడానికి నేనే వెళ్లి ప్రచారం చేసిన. ఇప్పుడు ఆయన కూడా…
తెలంగాణలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్నాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతుండటంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నువ్వా.. నేనా అన్నట్లుగా హూజూరాబాద్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ కు ఇంకా 13రోజులు ఉన్నాయి. అయితే 72గంటల ముందే…
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ… ఎక్కడి వాడో వచ్చి మన ఊర్లలో మన బొడ్రాయి దగ్గర ఈటల రాజేందర్ ఒక్క రూపాయి అభివృద్ధి చెయ్యలేదు అని అంటున్నారు. బ్రోకర్ గాళ్ళు, పని చేయని వారు వచ్చి మాట్లాడుతుంటే మీరు కూడా విని ఊరుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్నారు. ఈ ఊరికి రోడ్డు నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకముందే వేయించిన. చిన్న ఊరి వారికి కూడా పెద్ద బ్రిడ్జి…