రావణ రాజ్యం పోవాలి.. రాముడి రాజ్యం రావాలి అంటూ పిలుపునిచ్చారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో రోడ్ షోలో పాల్గొన్న ఆమె.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ ప్రచారం కంటే.. ప్రజల బీజేపీ ప్రచారం ఎక్కువగా ఉందన్నారు.. ప్రజలు బీజేపీ పార్టీ ప్రచారాన్ని భుజాన వేసుకున్నారన్న రాములమ్మ.. ఈటల రాజేందర్ ఆరు సార్లు గెలిచాడంటే ప్రజల మద్దతు ఎలా…
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుంకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక అన్నప్పటినుంచి అక్కడే ఉంటున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రజలను టీఆర్ఎస్ కు ఓట్లు వేసేందుకు వివిధ వరాలను గుప్పిస్తున్నారు. గురువారం జమ్మికుంట మండలం మాడిపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హరీశ్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలవనే గెలవదు.. గెల్చినా ఈటల మంత్రి అయ్యేది ఉందా.. నియోజకవర్గ పనులు చేసేది…
దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ముసలం మొదలైంది. అన్నాడీఎంకేలో మొదలైన ఆధిపత్య పోరు ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారగా సొంతపార్టీకి శాపంగా మారింది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలుగా విడిపోవడంతో కిందటి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలైంది. డీఎంకే అధికారంలోకి రావడానికి అన్నాడీఎంకేలోని లుకలుకలే ప్రధాన కారణమని ఆపార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకేను తాను దారిలో పెడుతానని ‘చిన్నమ్మ’ ప్రకటించుకోవడం విశేషం. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ కార్యక్రమాలను…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్లానింగ్ కమీషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… ఈటల ఎందుకు రాజీనామా చేసిండో ఇప్పటి వరకు చెప్పలేదు. హుజురాబాద్ అభివృద్ధి పై ఇప్పటి వరకు ఈటల మాట్లాడటం లేదు. నీ సమస్య నీబాధ నియోజకవర్గం ప్రజల మీద రుద్దుతావ అని ప్రశ్నించారు. హుజురాబాద్ రైల్వే లైన్ ను రిజెక్ట్ చేస్తే ఎంపీ సంజయ్ ఎం మాట్లాడటం లేదు. సంజయ్ కి చేతకాకపోయినా నేను పట్టుపట్టి హుజురాబాద్…
సాధారణంగా ఒక పార్టీకి ఏ అంశం పైన అయినా ఒకటే విధానం వుంటుంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా.. పార్టీలో ఏ పదవిలో వున్నవారైనా వాయిస్ ఒకటే వుంటుంది. కానీ అదేంటో ఏపీలో బీజేపీలో మాత్రం ఒకే అంశంపై రెండురకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ వుంటాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దగ్గర్నించి రాజ్యసభ ఎంపీ జీవీఎల్, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి వరకూ వివిధ రకాల అభిప్రాయాలు కనిపిస్తాయి. అనేకసార్లు జీవీఎల్, సోము వాయిస్…
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి మరో వారం రోజులే మిగిలాయి. దాంతో క్యాంపెయిన్ తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్స్ ఒక్కొక్కరుగా రంగంలో దిగుతున్నారు. అధికార పార్టీ నెల క్రితమే మంత్రి హరీష్ రావును రంగంలో దించింది. మరో రెండు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలను ప్రచారంలోకి దించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కేసీఆర్కు ప్రతిష్టకు సవాలుగా మారింది. గెల్లును గెలిపించే బాధ్యతను మంత్రి హరీష్ రావు…
పంజాబ్ లో కొత్త పార్టీ అవతరించబోతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని, పార్టీని స్థాపించిన తరువాత వారంతా తమతో కలిసి వస్తారని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు పెద్ద…
బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామిపక్కదేశమైన బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఖండించడం లేదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. చైనా లద్దాక్ను ఆక్రమించడానికి వచ్చినప్పుడు దూకుడు ప్రదర్శించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తుందో చెప్పాలన్నారు.ఆప్ఘన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్నారన్నారు. బంగ్లా మరో ఆప్ఘాన్ కాకముందే భారత ప్రభుత్వం స్పందించి బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువుల హక్కులను కాపాడాలన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్వంత పార్టీ…
పంజాబ్లో రాజకీయ పరిణామాలు ఆసక్తిరేపుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్ పార్టీలో కుంపటితో బయటకు వచ్చిన పంజాబ్ మాజీ సీఎం, సీనియర్ పొలిటికల్ లీడర్ అమరీందర్ సింగ్.. త్వరలో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు.. అంతేకాదు బీజేపీతో పొత్తు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం పార్టీ ఏర్పాటుపై.. అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ ట్వీట్ చేయడం హాట్ టాపిగ్గా మారింది. తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలను,…
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఫేక్ మార్కుల షీట్తో కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నందుకు ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీకి జైలు శిక్ష వేసింది స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు. అంతే కాదు రూ. 8 వేల జరిమానా కూడా విధించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూజా సింగ్ ఆదేశాలతో పోలీసులు ఎమ్మెల్యేను కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు. కాగా, ఇంద్ర ప్రతాప్ తివారీ.. డిగ్రీ చదువుతున్న రోజుల్లో.. రెండో ఏడాది ఫెయిల్ అయినప్పటికీ తప్పుడు…