యాసంగి పంటను కొనే దమ్ము బీజేపీకి ఉందా ఉంటే ఎన్ని లక్షల టన్నుల కొంటారో తేల్చి చెప్పాలని, ఆ మాట చెప్పకుండా బీజేపీ డ్రామాలు ఆడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎఫ్‌సీఐ ఇచ్చిన లేఖ తమ దగ్గరుందని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత యుత ప్రభుత్వం అని అన్నారు. అన్ని లక్షల టన్నుల ధాన్యం కొంటామన్నారు. వానాకాలమే కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేసిందని దానిని మేము రాజకీయంగా వాడుకోలేదని మంత్రి తెలిపారు.
ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొస్తుందన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు. బీజేపీ – టీఆర్ఎస్ పై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఇకనైనా బీజేపీ నేతలు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.