ఎవరేమి కామెంట్స్ చేసినా.. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి అని…హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్ లో బీజేపీ గెలుపు ఊహించినదేనని..హామీలు అమలు చేయటంలో కేసీఆర్ విఫలం అయ్యారని నిప్పులు చెరిగారు. ఈటల రాజేందర్ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని.. ఓటర్లను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. డబ్బును కాదని చైతన్యాన్ని చాటిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదములు తెలిపారు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ తో…
ఏపీలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు భయపడే వ్యక్తులు, శక్తులు ఎవరూ లేరని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్‌లోని నివాసంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జ్ఞానోదయం కలిగిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఉద్యమం చేయడానికి ఇప్పటికైనా ముందుకు వచ్చారని, పవన్ కళ్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ దూసుకుపోతుండగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్ కుదేలయింది. ఆరోరౌండ్ తర్వాత వైసీపీకి 52,044 ఓట్ల ఆధిక్యం లభించింది. పోటీలో నిలబడి పరువు కోల్పోయిందనే భావన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో వుంది. బద్వేల్ బరికి టీడీపీ, జనసేన దూరంగా వున్నాయి. బద్వేల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు గొప్ప ఓటు బ్యాంకు ఉందా అంటే అంత సీన్ లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌కు అక్షరాల 2వేల 148 ఓట్లు పోలయ్యాయి. ఇక…
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్ఎస్కు ఆధికంగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఈవీంఏంలలోని ఓట్లను లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 22 రౌండ్లు నిర్వహించనుండగా.. తొలి రౌండ్లో బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. మొదటి రౌండ్ లో 166 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తొలిరౌండ్లో బీజేపీకి 4,610…
బద్వేల్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో రాబోతున్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ లో అధికార వైసీపీ ఆధిక్యాన్ని కనబరిచింది. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల త్రిముఖ పోటీ జరిగినప్పటికీ వైసీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఇప్పటికే సర్వేలు తెలిపాయి. ఎంత మెజారిటీ వస్తుంది అనే దానిమీదనే అందరి దృష్టి నిలిచింది. Read: లైవ్ అప్డేట్స్: హుజురాబాద్, బద్వేల్ ఎన్నికల ఫలితాలు బద్వేల్ ఉప…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతోనే టీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 753 బ్యాలెట్ ఓట్లను లెక్కించగా అందులో టీఆర్ఎస్కు ఓట్లు ఆధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఇందులో… టీఆర్ఎస్ పార్టీకి 503 ఓట్లు పోల్ కాగా… బీజేపీ పార్టీకి 159 ఓట్లు వచ్చాయి. అలాగే… కాంగ్రెస్ పార్టీ కి 32 ఓట్లు పోల్…
5 నెలల ఉత్కంఠకు తెరపడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న 753 ఓట్లను లెక్కించి టీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈవీఏంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తం 22 రౌండ్లలో హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ముందుగా హుజురాబాద్ ఓట్లను లెక్కించనున్నారు.
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికు ఈ రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఏజెంట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పాసులు ఉన్నా మమల్ని అనుమతించడం లేదంటూ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టి వెల్లడంతో వారిని లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు…
గత 5 నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఉప ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి ప్రజలను ఎంతవరకు ఒప్పించారనేది ఈ రోజుతో తేలనుంది. ఓటర్లు మెచ్చిన లీడర్ ఎవరో నేటి ఓట్ల లెక్కింపుతో బయట పడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఈవీఏంలను కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే ఏర్పాటు చేసిన…
ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు అన్నారు. తెలంగాణ వచ్చినప్పటీ నుంచి సరైన ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తెలంగాణ యువత తీవ్ర మనో వేదనకు గురవుతుందని ఆయన అన్నారు. అందుకే ఉద్యోగాలపై మాట తప్పి, మడమ తిప్పిన టీఆర్ఎస్ సర్కార్ వైఖరికి నిరసనగా కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగ సమస్యపై నవంబర్ 12న నిరుద్యోగ మిలియన్ మార్చ్ ఉంటుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రదీప్‌రావు ప్రకటించారు.…