కేసీఆర్ అసలు గుట్టు బయటపెట్టిన విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని బీజేపీ మహిళా నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజా పరిస్థితిని గమనిస్తే…. కేంద్రం వద్ద బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) నిల్వలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి… వాటిని వినియోగించేందుకు కొన్నేళ్లు పడుతుంది కనుక… 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుంటుంది.
మిగిలిన బియ్యం రా రైస్ (పచ్చి బియ్యం) రూపంలో మాత్రమే ఇవ్వాలని… అలాగే ఉప్పుడు బియ్యాన్ని పరిమితంగా తీసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, యాసంగి ధాన్యం కేవలం బాయిల్డ్ రైస్‌కే పనికి వస్తాయనేది అశాస్త్రీయమైన అంశమని… పైగా, ఇది రైస్ మిల్లర్లకు సంబంధించిన వ్యవహారమని… ఇందులో రైతుకు ఏమాత్రం సంబంధం లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి మే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
Also Read
కానీ.. సెప్టెంబరు 26న ఢిల్లీ టూర్ వెళ్లిన సీఎం కేసీఆర్…. గత యాసంగిలో 92.34 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని… దీని నుంచి 62.52 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ఉత్పత్తి అయ్యాయని… ఉత్పత్తిలో కనీసం 90 శాతం బాయిల్డ్ రైస్ తీసుకోవాలని, రానున్న రోజుల్లో ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ అసలు ఇవ్వబోమని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి… పాత కోటాకు (24.75 లక్షల టన్నులు) మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌ను అదనంగా ఎఫ్‌సీఐకి సరఫరా చేస్తామని స్పష్టంగా ఒప్పందం చేసుకుని… కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఎఫ్‌సీఐకి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తామని… ఇక మీదట ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని హామీ ఇచ్చారు.
కేంద్రం కూడా ఈసారికి తప్ప… మరోసారి ఒక్క కూడా గింజ బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కరాఖండిగా చెప్పి ఈ మేరకు లేఖాస్త్రాలన్నీ సెప్టెంబరు నెలాఖరుతోనే పూర్తి చేసింది. అయితే… కేంద్రం వద్ద ఒప్పుకుని, లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చిన అంశాన్ని సీఎం కేసీఆర్ ఇంతకాలం అధికారికంగా వెల్లడించకుండా… కేంద్రం అసలు బాయిల్డ్ రైస్ కొనబోమని అంటోందని, వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని, రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దనే ప్రచారాన్ని మొదలుపెట్టి… హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో మతి భ్రమించి, మిల్లర్లతో కుమ్మకై… నేడు ధర్నా పేరుతో రాద్ధాంతాన్ని సృష్టిస్తూ… రైతులను ఆందోళనలో పడేస్తూ… కేంద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం రాష్ట్ర సర్కార్ కపటనాటకాలను గమనించి రానున్న రోజుల్లో కేసీఆర్‌ను గద్దె దించాలి అని ఆమె వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!