ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసే దీపావళి పండగ జరుపుకోనున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని లోంగేవాలా సరిహద్దు వద్ద సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు. ఈ సారి ఆయన జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇవాళ నౌషేరా, రాజౌరీ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లనున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2019లో కూడా రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొన్నారు.
భారత ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తరువాత ఏ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు తీయడానికి వీళ్లేదని ఎన్నికల అధికారులు నిబంధనలు జారీ చేశారు. అయితే నిన్న ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని తెలుపుతూ ఈటల రాజేందర్‌తో పాటు…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. హుజురాబాద్ గెలుపు.. ప్రజల గెలుపు అన్నారు. ఈటల రాజేందర్ పై ఎన్ని కుట్రలు చేసినా… చివరికి తామే గెలిచామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ పేరుతో తప్పించుకున్నారని… దళిత బంధు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నిగ్ ఇచ్చారు. దళిత బంధు…
ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానివ్వం అంటూ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి.. కార్మికుల ఆందోళనకు బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.. అయితే, స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వం పాలన మాత్రమే చేయాలి.. వ్యాపారం చెయ్యకూడదన్నది ప్రధాని నరేంద్ర మోడీ పాలసీగా చెప్పుకొచ్చారు.. అందుకే విశాఖ…
ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ గల్లంతు అయింది. వైసీపీ అభ్యర్థి మొదటి రౌండ్ నుంచి ఏకపక్షంగా ఫలితాలను నమోదు చేసి ఘన విజయం సాధించింది. 90,411 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలుపొందారు.. అయితే, బీజేపీ అభ్యర్థి సురేష్‌కు 21 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.. ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మకు 6 వేల పైచిలుకు ఓట్లు…
ఈటల రాజేందర్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.. దీంతో.. వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు అయ్యింది.. అయితే, ఈ ఎన్నికల్లో విజయం క్రెడిట్ అంతా ఈటల రాజేందర్‌దే అనే చర్చ సాగుతోంది.. ఈటల లేకుండా హుజురాబాద్‌లో బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయని అని గణాంకాలు వేసేవారు కూడాలేకపోలేదు. అయితే, ఇవాళ ఈటల రాజేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్.. ఈటల రాజేందర్ గెలుపు బీజేపీ గెలుపు…
హోరాహోరిగా జరిగిన హుజురాబాద్ ఎన్నికలు మీనియుద్ధానే తలపించాయి. చివరకు విజయం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను వరించింది. ఈటల గెలుపుపై బీఎస్పీ కన్వీనర్, మాజీ IPS ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. అహంకారంతో, కక్షతో, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ టీఆర్ఎస్ పాలకులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి, బహుజన బిడ్డ ఈటల రాజేందర్‌ను ఎమ్మెల్యేగా…
ఈ విజయం ప్రజలది.. వారికి నేను ఋణపడి ఉంటానన్నారు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్.. తన విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. డబ్బు సంచులను, మద్యం సీసాలకు హుజురాబాద్ ఓటర్లు పాతరేశారన్నారు.. చిన్నచిన్న ఉద్యోగస్తులను కూడా అధికార పార్టీ వేధింపులకు గురిచేసిందని విమర్శించిన ఆయన.. 75 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడ జరగలేదన్నారు.. నా గెలుపునకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.. ఇక, ముఖ్యమంత్రి…
హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా విజయాలు సాధించిన ఈటల.. ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగి మరోసారి గెలుపొందారు. రాజేందర్ 2021 జూన్‌లో టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు అనివార్యం అయిన సంగతి తెలిసిందే.. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు. అయితే,…
వరి విత్తన విక్రయాలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ .. వరి విత్తనాలు అమ్మితే షాపు సీజ్ చేసి లైసెన్స్ ర ద్దు చేస్తానని, నేను ఉన్నంత వరకు మళ్లీ షాప్ తెరిచే అవకాశం కూడా ఉండదంటూ సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసి వ్యా ఖ్యలను రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టిందన్నారు. వరి విత్తనాలు అమ్మే విషయంలో హైకోర్టు , సుప్రీంకోర్టు…