తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలనే ముఖ్య డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరఫున టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే… ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం నాగేందర్.. తన నియోజక వర్గం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం నాగేందర్. బండి సంజయ్ తలపైన ఉన్న నాలుగు వెంట్రుకలు పీకేసి… గుండు గీయిస్తామని హెచ్చరించారు దానం నాగేందర్. హైదరాబాద్‌లో అడుగు పెడితే… ఎంపీ అరవింద్ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు దానం నాగేందర్.