బియ్యం కొనుగోలు విషయంలో తెలంగాణ సర్కార్ పూటకో నాటకం ఆడుతుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కేంద్రంపైనా, బీజేపీ నాయకత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని ఆమె ధ్వజమెత్తారు. బాయిల్డ్ రైస్( ఉప్పుడు బియ్యం) కొనుగోలు అంశంలో టీఆర్‌ఎస్ నేతలు, మంత్రలు చేస్తున్న దుష్ప ప్రచారం చేస్తున్నారన్నారు. పలు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్న సూక్ష్మ పోషకాలు కలిగిన ఉప్పుడు బియ్యాన్ని నెలకు 5లక్షల టన్నులు ఇచ్చినా కొంటామని ఎఫ్‌సీఐ తెలంగాణ జీఎం స్పష్టం చేసినా తెలంగాణ సర్కారులో కదలిక లేదన్నారు.
అక్టోబర్ నెలాఖరుకు నాటికి ఉన్న పరిస్థితిని గమనిస్తే మొత్తం 44.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాని రాష్ర్ట ప్రభుత్వం ఎఫ్‌సీఐకి పంపాల్సి ఉండగా అందులో సగమే పంపారన్నారు. ఇప్పటికే కేం ద్రం దేశంలోని బడుల్లో మధ్యాహ్న భోజనానికి, అంగన్వాడీలు, రేష న్‌షాపుల్లో పూర్తిగా ఫోర్టిఫైడ్ రైస్ వాడకం, సరఫరాకు కేంద్రం కసరత్తు ప్రారంభించిందన్నారు.
2019-2020 నుంచి ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాల్లో ఫోర్టిఫైడ్ రైస్ వాడకం దిశగా కేంద్రం దేశవ్యాప్తంగా112 జిల్లాలను మూడేళ్ల కాలానికి ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తే దక్షణాదిలో పలు రాష్ర్టాలు ఈ అవకాశాన్ని వినియోగిం చుకున్నాయని, కానీ తెలంగాణ నుంచి సరైన స్పందన లేదన్నారు. సూక్ష్మపోషకాలు ఉన్న బియ్యాన్ని ఉప యోగించు కోవాలని, ఎఫ్‌సీఐకి సరఫరా చేయాలని, కేంద్ర విద్యాశాఖ లేఖ రాసినా తెలంగాణ పాల కుల నుంచి స్పందన కరువైందన్నారు. ఒకవైపు ఇన్ని అవకా శాలు ఉన్నప్పటికీ వినియోగించుకోకుండా తెలంగాణ పాలకులు కేంద్రాన్ని దోషిగా చూపెడుతున్నారని విజయశాంతి మండిపడ్డారు.