ఏపీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు అమిత్ షా మూడు రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఈ నెల 13 వ తేదీన రాత్రి తిరుపతి లో బస చేయనున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఈ నెల 14 వ తేదీన ఉదయం నెల్లూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. 14 వ తేదీన మధ్యాహ్నం నుంచి తిరుపతి లో సదరన్ జోనల్ ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొని రాత్రి తిరుమలలో బస చేయనున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఇక శ్రీవారి దర్శనం చేసుకొని 15 వ తేదీన మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు అమిత్ షా.