గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయంటూ రైతులు, విపక్ష నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు సంవత్సరం పాటు రైతులు దేశరాజధాని ఢిల్లీలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యం ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను కూడా రద్దు చేశారు.
అయితే వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు డిమాండ్ చేశాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానిపై స్పందించలేదు. అయితే రైతులతో చర్చించి మరోసారి వ్యవసాయ చట్టాలను రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రైతు సంఘాలు కేంద్రంతో చర్చించేందుకు కమిటీని ప్రకటించాయి. మొత్తం 5గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. అయితే పంటకు కనీస మద్దతుధరపై కేంద్రంతో కమిటీ చర్చలు జరుపనుంది.