Minister Nara Lokesh: మన చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా అమరావతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
- మన చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా అమరావతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ..
- ప్రపంచస్థాయి ప్రమాణాలతో జ్ఞాన కేంద్రంగా సెంట్రల్ లైబ్రరీని తీర్చిదిద్దాలి..
- విద్యాశాఖపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశం ..
- సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ప్రజా రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా ఉండాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో త్వరలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను మంత్రి పరిశీలించారు. సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి నిపుణులు రూపొందించిన వీడియోను వీక్షించారు. పలు సూచనలు చేశారు. ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక వసతులతో జ్ఞాన కేంద్రంగా సెంట్రల్ లైబ్రరీని తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. మన ఘన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా నిలవాలి. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా సెంట్రల్ లైబ్రరీ ఉండాలన్నారు.. ఆర్కైవ్స్, ఆడిటోరియం వసతులతో పాటు 15 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలని.. జ్ఞాన కేంద్రంగానే కాకుండా విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడాలి. అన్ని వర్గాల ప్రజలు సెంట్రల్ లైబ్రరీతో అనుసంధానం కావాలన్నారు మంత్రి లోకేష్.. ఇందుకు సంబంధించి మొత్తం ఎకోసిస్టమ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు…
Read Also: క్రిస్టల్ క్లియర్ కాల్స్, అడాప్టివ్ సౌండ్.. Sony WH-CH720N వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ సగం ధరకే..
Also Read
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
ఇక, ఈ సమావేశంలో పదో తరగతి పరీక్షలు, అభ్యసన సామర్థ్యాల పెంపుపై చర్చ జరిగింది.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ అమలు తీరు, క్లిక్కర్ వీడియోలు, పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికపైనా సమావేశంలో చర్చించారు. విద్యార్థుల హాజరు, మార్కులు వంటివి తెలుసుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన లీప్ యాప్ ను ఎంత మంది తల్లిదండ్రులు డౌన్ లోడ్ చేసుకున్నారో మంత్రి ఆరా తీశారు… విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్‌ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!