బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వనదేవతలైన సమ్మక్క- సారలమ్మలను సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఎత్తు బంగారం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆయన వెంట స్థానిక బీజపీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. కల్లాల వద్ద ఉన్నా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. దళిత బంధుతో దగా చేశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకుని రాష్ర్ట ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. జాతర…
టీఆర్ఎస్ తీరు వల్లే రైతులకు కష్టాలు.. వస్తున్నాయని కానీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనదని ఎక్కడ చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో టీర్ఎస్ బెంబెలేత్తి పోతుంది.ఈ సీజన్లో చివరి బస్తాను కేంద్రం కొంటుందని చెప్పారు. టీర్ఎస్ లేని సమస్యలు సృష్టిస్తుంది. ధాన్యం సేకరణ అసలు సమస్యే లేదు. ఉప్పుడు బియ్యం తీసుకోమని చాలా ఏళ్ళ కిందే కేంద్రం స్పష్టం చేసింది. రా రైస్ వచ్చే విధంగా…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సభ ప్రారంభం నుంచి విపక్షాలు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పలు మార్లు సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మరోసారి గందరగోళం ఏర్పడడంతో రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎలమరం కరీం – సీపీఎం, బినోయ్ విశ్వం –…
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకవచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ఇటు ప్రతిపక్షాలు, అటు రైతులు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యవసాయ చట్టాల…
టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు చోటులేదని..కేవలం భజన పరులకు మాత్రమే చోటు ఉందంటూ హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నేడు పాల్వంచలో పర్యటించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా పాల్వంచ తెలంగాణ నగర్ లో ఈటలకు ఘనస్వాగతం పలికారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలను టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోదని మండిపడ్డారు. ఈ తెలంగాణ నగర్ లో నివాసం ఉండేది నిరుపేదలని.. అందుకే వారికి ఇళ్ల పట్టాలు…
కేంద్రంపై నిందలు వేసి లబ్ధి పొందండం కేసీఆర్‌కు బాగా అలవాటైందని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువ లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ వైపు కల్లాల్లో రైతులు ధాన్యం పోసి కొనాలంటుంటే యాసంగి వడ్ల పంచాయతీని…
పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ తగ్గించేదాకా…. బీజేపీ దశల వారీ ఉద్యమం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం పార్టీ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులతో బండి సంజయ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించారు. నేడు, రేపు అన్ని మండల కేంద్రాల్లో ఎద్దుల బండ్లపై బీజేపీ కార్యకర్తల ధర్నాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో…
వరి కుప్పల పై రైతుల చావులకు కేసీఆర్ బాధ్యత వహించాల్సిదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల కోసం నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్‌పై, బీజేపీ పైనా తీవ్ర విమర్శలను గుప్పించారు. వరి ధాన్యం కుప్పలపై రైతులు చనిపోవడంపై స్పందిస్తూ.. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలన్నారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని అపాయింట్మెంట్ లెటర్ చూపెట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడతున్న కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే…
సొంత స్థలం ఉన్న వారికి రెండు పడక గదుల ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా సూర్యపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురింపించారు. 2014లో రాష్ర్ట అప్పులు రూ.65వేల కోట్లు ఉండగా.. ఏడున్నరేళ్లలో ఆ అప్పును రూ.4 లక్షలకు కోట్లకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన ఆరోపించారు. ప్రతి నెల రూ.65 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సిన దుస్థితికి…