రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణమైన విషమే.. అవి కొన్నిసార్లు శృతి మించి ఇంకా ముందుకు సాగిన సందర్భాలు కూడా లేకపోలేదు.. రాజకీయ నేతలు హత్యకు గురైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నేతల మధ్య రాజకీయాల్లోనైనా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అందరూ కోరుకునే విషయం. అయితే, తాజాగా ఓ ఎమ్మెల్యే హత్యపై ఇద్దరి మధ్య కుదిరిన డీల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది… బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ…
బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి తప్పించేందుకు టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంకణం కట్టుకున్నారు. దీనికోసం నిత్యం అన్ని పార్టీల ప్రముఖ రాజకీయ నేతలను మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె శరద్పవార్తో భేటీ అయ్యారు. అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ.. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం కావాలన్నారు. అంతేకాకుండా టీఎంసీతో మాకు పాత అనుబంధం ఉందని గుర్తు…
ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులపై విచక్షణ కోల్పోయి బూతులు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం, భాజపా నాయకులు చేసిన తప్పేంటో కేసీఆర్ ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కేసీఆర్ దూషించిన భాష సభ్య సమాజం తల దించుకునేలా ఉందని, మేధావులు కేసీఆర్ భాషపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. బూతులు మాట్లాడిన కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండటం…
టీఆర్ఎస్ నేతలు బియ్యం స్మగ్లంగ్తో కోట్లు ఆర్జిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేస్తూ మాటల దాడికి దిగారు. గిరిజన యూనివర్సీటీకీ రాష్ర్ట ప్రభుత్వమే ఇప్పటివరకు స్థలం కేటాయించలేదని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ అండతోనే మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తున్నారని అరవింద్ అన్నారు. ఎఫ్సీఐకి తెలంగాణలో పండే పంటను తక్కువగా ఇస్తూ, రీస్లైకింగ్ బియ్యం ఎక్కువగా ఇస్తూ కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారని…
హైద్రాబాద్పై బీజేపీ కుట్ర చేస్తుందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, కేంద్రం పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తామని తెలంగాణ పసుపు రైతులను మోసం చేశారన్నారు. ఆయనకు చేతనైతే వెంటనే పసుపు బోర్డుపై కేంద్రంతో మాట్లాడి తీసుకురావాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ఇష్టానుసారం మాట్లాడుతుందన్నారు. తెలంగాణ మంత్రులు ఢీల్లీకి వెళ్లిన కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్…
సీఎం కేసీఆర్పై మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వానా కాలం తరహాలోనే.. యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బండి సంజయ్ హెచ్చరించారు. యాసంగిలో ధాన్యం కొనకపోతే.. అంతుచూస్తామని వార్నింగ్ ఇచ్చారు. మెడ మీద కత్తి పెడితే… ఫామ్ హౌస్ రాసిస్తావా అని చురకలు అంటించారు బండి సంజయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా మాట్లాడితే….సీఎం కేసీఆర్ కు మాత్రం మైండ్ దొబ్బిందని ఫైర్ అయ్యారు. నాలుకకు,…
వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ సర్కార్ ల మధ్య పంచాయితీ తెగడం లేదు. నిన్న కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ మండిపడగా… తాజాగా కేంద్రంపై రెచ్చిపోయారు హరీష్రావు.వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో మొత్తం కలిపి ఎన్ని వడ్లు కొన్నారో… ఒక్క సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని వడ్లు కొనుగోలు చేసామో తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ హయాంలో ఉన్న కొనుగోలు…
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందంటోంది వ్యవసాయ శాఖ. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తూన్నారు ఉద్యానవన శాఖ అధికారులు.దేశవ్యాప్తంగా కూరగాయలకు రోజురోజుకు డిమాండ్ పెరుతుంది. కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాలో ఉద్యానవన శాఖ అధికారులు ఏయే కూరగాయలు సాగు చేస్తే లాభం చేకూరుతుంది అనే దానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువగా టమాటా, మిర్చి వంటి కురాగాయలతో…
తెలంగాణ రాష్ర్ట సాధన కోసం 29 నవంబర్ 2009న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజని, తెలంగాణ ఉద్యమగతిని ఆరోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసిందని టీఆర్ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పదవులను తృణ ప్రాయంగా వదిలేసి పోరాట బాట పట్టిన…
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తలెత్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న అప్పులకు పొంతన లేకుండా పోతుందన్నారు. మాటి మాటికీ కేంద్రం పై వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన సాయం అందుతున్నప్పటికీ…