Ragi recipe: రాగి జావా ఇలా తయారు చేయండి.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..
- రాగి జావా ఇలా స్పెషల్‌గా చేసుకోండి..
- రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi recipe: ప్రస్తుతం ఉన్న ఫుడ్ అలవాట్ల కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంతో తృణధాన్యాల వినియోగం పెరిగింది. ముఖ్యంగా రాగి వంటకాల ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా షుగర్‌తో బాధ పడుతున్న వారికి రాగి ఒక మంచి ఆహారంగా చెప్పవచ్చు. దీనిలో ఉండే B1 ,B2 , B3, B6, B9 వంటి విటమిన్లు ఉంటాయి. ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీకి ఉపయోగపడుతుంది.
షుగర్ ఉన్నవారికి మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులకు కూడా రాగి జావా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం సాధారణంగా మరుగుతున్న నీటిలో, నీటిలో కలిపిన రాగి మిశ్రమాన్ని కలపడం ద్వారా రాగి జావా తయారు అవుతుంది. ప్రతీ రోజు ఇలాగే తాగాలంటే బోర్ కొడుతుంది. దీని కోసమే ఇలా ప్రత్యేకమైన రాగి జావా తయారు చేసుకుంటే, రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
స్పెషల్ రాగి జావా తయారీ విధానం:
* ముందుగా ఒక ప్యాన్ లో కాసింత నెయ్యి లేదా ఆయిల్ వేసి, వేడి అయ్యాక అందులో సన్నగా కట్ చేసిన క్యారెట్, వెల్లుల్లి తరుమును వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకుని వేగే దాకా ఆగాలి. క్యారెట్‌తో పాటే కార్న్, పచ్చి బఠాణీ గింజలను వేసుకుని వేగేలా కలుపుకోవాలి.
* దీని తర్వాత నీటిని పోసుకుని మరిచేలా కలుపుకోవాలి. నీరు మరిగే సమయంలో రాగి మిశ్రమాన్ని అందులో కలుపుకోవాలి. ఉండలు లేకండా రాగి పొడిని ముందుగానే నీటిలో కలుపుకుని ఒక మిశ్రమంగా చేసుకోవడం మరిచిపోవద్దు. ఇలా చేస్తే మరుగుతున్న నీటిలో పర్‌ఫెక్ట్‌గా కలుస్తుంది. ఉండలు ఉండవు. మిశ్రమం ముద్దలుగా ఉండదు. చివరకు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. కొందరు గార్నిష్ చేయడానికి కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసుకుంటారు.
* ఈ విధానంలో రాగి జావా తయారు చేసుకోవడంతో మంచి రుచి వస్తుంది. దీంతో పాటు కార్న్, క్యాబేజ్, పచ్చి బఠాణీ వేసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ మరింత పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు మంచిది. వెల్లుల్లి వల్ల రుచితో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంంది.
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!