Bandi Sanjay : ప్రీతిది ముమ్మాటికీ హత్యే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగాం జిల్లా గిర్ని తండాలో ప్రీతి కుటుంబ సభ్యులను తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్… మీరు తప్పు చేయకపోతే మెడికో విద్యార్ధి ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఈ విషయంలో మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? ప్రీతి తరపున పోరాడే విద్యార్థులను ఎందుకు బెదిరిస్తున్నారు?’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఎంజీఎం ఆసుపత్రిలోనే ప్రతి చనిపోయిందని… నిందితుడు సైకోను కాపాడేందుకు డెడ్ బాడీని ఎత్తుకుపోయి నిమ్స్ లో చికిత్స చేస్తున్నట్లుగా డ్రామా చేశారని మండిపడ్డారు. డెడ్ బాడీ థంబ్ ద్వారా ప్రీతి మొబైల్ లాక్ ను ఓపెన్ చేసి ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. పోలీసులారా… మీ కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగితే.. ఇదే విధంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు.
Also Read : Tamannaah Bhatia: ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
అంతేకాకుండా.. ‘గత 7 రోజుల క్రితం ఎంజీఎంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చూపారు. సైఫ్ అనే వ్యక్తి ర్యాగింగ్ చేసినట్లుగా చెప్పడం, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా స్పందించకుండా కాలేజీ హెచ్ఓడీ ప్రీతినే బెదిరించడం వంటివనీన చూశాం. ప్రీతి ఆత్మహత్య చేసుకునే పరికితనం ఉన్న అమ్మాయి కాదు. నిర్మొహమాటంగా చెప్పే అలవాటుందని ఆమె ఫ్రెండ్స్ చెప్పారు. కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. ఆధారాలన్నీ చెరిపేశారు. లాక్ ఉన్నమొబైల్ ను ఎట్లా ఓపెన్ చేస్తారు?నిందితుడికి అనుకూలంగా వ్యవహరించారు. నిందితుడి వల్ల మత కల్లోలాలు వస్తాయనే భయపడ్డట్లున్నరు. ప్రీతిది హత్యే… ఆత్మహత్య కాదని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మేం డిమాండ్ చేశారు.
Also Read : Summer Tips: వేసవిలో ఇవి తీసుకుంటే సూర్యుడు ఎంత వేడిగా ఉన్నా.. మీరు చల్లగా ఉంటారు
ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ జరిపితే ప్రీతి చనిపోయేది కాదు. నిందితుడి సైఫ్ పక్షాన బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండటం సిగ్గు చేటు. సీఎంకు సిగ్గు లేదు. విద్యార్థులు, రాజకీయ నేతలు స్పందిస్తారని భయపడి… చనిపోయిన డెడ్ బాడీని నిమ్స్ కు తీసుకెళ్లి దొంగ ట్రీట్ మెంట్ చేశారు. డెడ్ బాడీని ఎత్తుకుపోయే చిల్లర సంస్క్రుతికి కేసీఆర్ ప్రభుత్వం తెరదీసింది. కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లే చేయాలట. వాళ్లకు కనీసం సెంటిమెంట్ లేదు. తొందరగా డెడ్ బాడీని ఖననం చేసి చేతులు దులుపుకోవాలని చూశారు. కేసీఆర్ కొడుకుకు కండ కావరం ఎక్కింది. బలుపెక్కి మాట్లాడుతున్నడు. ప్రీతి ఘటనపై ఎందుకు స్పందించలేదు? ప్రతి దానికి ట్వీట్ చేస్తావ్ కదా… హోంమంత్రి అసలున్నాడా? పాతబస్తీకే పరిమితమైండు. చనిపోయిన డెడ్ బాడీని తీసుకొచ్చి థంబ్ పెట్టి మొబైల్ లాక్ ఓపెన్ చేశారంటే వీళ్లు ఎంతటి దుర్మార్గులో అర్ధమవుతోంది. ప్రీతి ఎలా చనిపోయిందో ఇప్పటికీ పూర్తిగా పోలీసులు వాస్తవాలు వెల్లడించలేదు. పోలీసులూ… మీకు కుటుంబాలున్నాయి? మీ వాళ్లకు ఇట్లా జరిగితే ఇలానే వ్యవహరిస్తారా? పేదోళ్ల బతుకులకు న్యాయం ఉండదా?
ప్రీతి ఘటనకు నిరసనగా వాస్తవాలు తెలియజేయాలని బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తే లాఠీ చార్జ్ చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు నిరసనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష చేస్తున్నాం. కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా న్యాయ పోరాటం చేస్తాం. కేసీఆర్ కు ఎస్టీలంటనే చులకన. విద్యార్థులు, అమ్మాయిలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. పోడు భూముల సమస్య పరిష్కరించడు. గిరిజన రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. కేసీఆర్… మీకు తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిపై కఠినంగా ఎందుకు శిక్షించడం లేదు? ప్రీతి తరపున పోరాడే విద్యార్థులను ఎందుకు బెదిరిస్తున్నవ్? బిడ్డా… మీకు రోజులు దగ్గర పడ్డయి. ఇంకెన్నాళ్లు ఈ అరాచకాలు చేస్తారో చూస్తాం..’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!