Karnataka: మరోసారి కర్ణాటకకు ప్రధాని మోదీ.. ఎన్నికల నేపథ్యంలో వరస పర్యటనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi To Visit Karnataka On March 12: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోయే కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఈ నెల 12న కర్ణాటకకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపుగా రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ప్రతిష్టాత్మక 10 వరసల మైసూర్-బెంగళూర్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని మాండ్యాలో ప్రారంభించనున్నారు. ఆ తరువాత హుబ్బళ్లి-ధార్వాడలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేయనున్నారు.
Read Also: BSF Jobs: బీఎస్ఎఫ్ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్.. కేంద్రం నిర్ణయం
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
మైసూర్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 118 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని రూ. 8480 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇది బెంగళూర్, మైసూర్ నగరాల మధ్య ప్రమాణ సమయాన్ని 3 గంటల నుంచి కేవలం 75 నిమిషాలకు తగ్గనుంది. మైసూరు-ఖుషాల్‌నగర్ 4 లేన్ హైవేకి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 92 కి.మీ.లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ సుమారు రూ. 4130 ఖర్చుతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి వల్ల బెంగళూర్,ఖుషాల్ నగర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతోంది. ధర్వాడ్ లో ఐఐటీని ప్రారంభించనున్నారు. హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ రికార్డును ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. 1507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను సుమారు రూ.20 కోట్లతో నిర్మించారు.
త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న కర్ణాటక రాష్ట్రంలో వరసగా ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మరోసారి ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వరసగా అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రముఖ సినీనటి, మాండ్యా ఎంపీ సుమలత ప్రధాని సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఆమె ఈ రోజు బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!