కేంద్రం నోట్ల రద్దు వల్ల 62 లక్షల మంది ఉద్యోగాలు పోయాయని, దేశ జీడీపీ పడిపోయిందన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లు ప్రింటింగ్ కు 21 వేల కోట్లు ఆర్‌బీఐ ఖర్చు చేసిందన్నారు. నోట్ల రద్దు నిర్ణయం నష్టాలకు కేంద్రం ఇచ్చే సమాధానం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఇదే బీజేపీ పార్టీ.. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే నియంత్రణ చేస్తారని, నీతి ఆయోగ్ ను కేంద్రం పట్టించుకోదన్నారు. బీజేపీ చేసేది అప్పులు… చేసేది తప్పులు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు పై దేశ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దుపై కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. దేశంలో మతపిచ్చిని రెచ్చగొట్టడంలో మాత్రం బీజేపీ సక్సెస్ అయ్యిందని ఆయన ఆరోపించారు. మంచి లక్ష్యంతో చేస్తున్నామని మోడీ చెప్పారు… మేము నమ్మి అప్పడు మద్దతు ఇచ్చామన్నారు.
Also Read : Vijaysai Reddy: ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్.. మౌలిక వసతులకు రూ.1000 కోట్ల సాయం
దొంగనోట్ల సంఖ్య 54 శాతం పెరిగినట్లు ఆర్‌బీఐ నే చెప్పిందని, బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రజలు వాడే నగదు తక్కువ అని, ప్రస్తుతం చలామణిలో ఉన్న నగదు రెట్టింపు అయిందన్నారు. 2014కు ముందు దేశ జీడీపీలో 11 శాతం నగదు ఉండేదని, ప్రస్తుత దేశ జీడీపీలో 13 శాతానికి పైగా నగదు చలామణిలో ఉందని ఆయన వెల్లడించారు. పెద్ద నోట్ల వాడకం పరిమితం కాలేదని, రెట్టింపు అయిందని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలో నల్లధనం, అవినీతి పెరిగినట్లు తెలుస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీ పాలనలో మాదకద్రవ్యాల రవాణా, టెర్రరిజం పెరిగిపోయిందని ఆయన తెలిపారు. కేంద్రం చెప్పిన డీమానిటైజేషన్ లక్ష్యాలు ఒక్కటి కూడా నెరవేరలేదని ఆయన మండిపడ్డారు.
Also Read : Love Marriage : అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి..