ఇదీ….లీకేజీ….ప్యాకేజీ…నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్ అంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ లీక్ అయ్యాయని, గ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీ అంటూ ఆయన మండిపడ్డారు. ఇదిగో సాక్ష్యం అంటూ.. ప్రవీణ్ ఓంఆర్ షీట్ విడుదల చేశారు బండి సంజయ్. పేపర్ లీక్ చేసిన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కు అత్యధిక మార్కులా? అని ఆయన ప్రశ్నించారు. ప్రవీణ్ కోసం ప్రత్యేకంగా ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్ టీంకు లీక్ అయ్యాయని, గతంలో సింగరేణి పరీక్షా పత్రాలు లీకేజీ అయ్యాయన్నారు. లీకేజీపై న్యాయ విచారణ జరపాల్సిందేనని ఆయన అన్నారు. లేనిపక్షంలో నిరుద్యోగులతో ప్రగతి భవన్, టీఎస్సీఎస్సీని ముట్టడిస్తామని బండి సంజయ్ వెల్లడించారు.
Also Read : Congress: మోదీజీ.. ఆస్కార్ అవార్డుల ఘనత మీదని చెప్పుకోవద్దు..
ఇదిలా ఉంటే.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. ఈనెల 18న శనివారం కమిషన్ ముందు హాజరవుతున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కమిషన్ ఆదేశించినట్లుగా బుధవారం హాజరుకాలేనని లేఖలో పేర్కొన్న బండి సంజయ్.. బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యడిగా బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read : Allu Arjun: ఆర్ఆర్ఆర్ పై బన్నీ ప్రశంసల వర్షం.. అందరి చూపు ఆ ఒక్క మాటమీదే