Telangana BJP: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తున్నట్లు జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బండి సంజయ్ కు కొత్త బాధ్యతలు అప్పగిస్తామని ఆయన హామి ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే.. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కొత్త అధ్యక్షుడిగా సత్యకుమార్ ను నియమిస్తున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు జేపీనడ్డా తనకు ఫోన్ చేసి చెప్పినట్లు సోము వీర్రాజు మీడియాకు తెలిపారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. అయితే బండి సంజయ్ కు కొత్త బాధ్యతలు అప్పగిస్తారన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. అయితే ఏపీ బీజేపీ చీఫ్ ను ఇవాళ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్ గా సత్య కుమార్ ను నియమిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మరికొద్ది నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ పార్టీలో కీలక మార్పులు చేయనుంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో ఈ ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను భాజపా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ ఎన్నికల సన్నాహకానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు, ఇందులో భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సమయంలో రాష్ట్రాలలో అధ్యక్షులను మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ మార్చబోతోంది. ఈ రాష్ట్రాల బాధ్యతలను పార్టీ కొత్తవారికి అప్పగించవచ్చు. తెలంగాణ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డిని, పంజాబ్ అధ్యక్షుడిగా జేపీ నాగ, సునీల్ జాఖర్, కర్ణాటక అధ్యక్షుడిగా అశ్వత్ నారాయణ్ లేదా శోభాను నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను కీలక నేతలకు అప్పగించనున్నారు.
తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డికి గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుత అధ్యక్షుడిగా బండి సంజయ్‌కు మంచి మార్కులు ఉన్నప్పటికీ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయనను మార్చాల్సి వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు.బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి వస్తాడనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఇన్ని రోజులు ఖండిస్తున్న బీజేపీ నేతలు కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు. అదే సమయంలో హన్మకొండలో జరిగిన సభలో బండి సంజయ్ కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యారు. 8న రాష్ట్ర అద్యక్షుని హోదాలో ప్రధాని బహిరంగ సభకు వస్తానో రానో..! అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మార్పు ఖాయమని పార్టీ వర్గాలు ధృవీకరించాయి.