స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. భారతదేశం “విశ్వగురువు”గా మారాలంటే ప్రజలు సామరస్యంగా జీవించాలని.. మంచి విద్య, వైద్య సదుపాయాలు మరియు నిరంతర విద్యుత్ సరఫరాకు హామీ ఇవ్వాలని ఆయన అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేజ్రీవాల్ ఛత్రసాల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికులు మరియు వివిధ రంగాలలో సాధించిన వారికి నివాళులు అర్పించారు.
Students Protest: స్వాతంత్య్ర దినోత్సవం రోజు కుళ్ళిన ఇడ్లీలు పెట్టారని విద్యార్థుల ఆందోళన
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఢిల్లీలో వరదల గురించి ప్రస్తావించారు. కేంద్రం సహాయంతో కలిసి ప్రజలు ప్రకృతి విపత్తును ఎదుర్కొన్నారని అన్నారు. అంతేకాకుండా.. దేశంలో అంతర్గతంగా చెలరేగుతున్న హింస, ఘర్షణలపై కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంతోషకరమైన రోజున తన మనసు బాధగా ఉందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ మండుతోందని ఒక సోదరుడు, మరో సోదరుడితో గొడవపడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అంతర్గత విభేదాలు చెలరేగుతున్నప్పుడు భారతదేశం ప్రపంచ నాయకుడిగా, విశ్వగురువు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అంతేకాకుండా.. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం నుహ్‌లో హింసకు కారణమని కేజ్రీవాల్ విమర్శించారు.
DVV Entertainment: రేయ్ ఎవడ్రా నువ్వు.. సుజీత్ ఫొటోకి డీవీవీ షాకింగ్ కామెంట్!
అంతర్గత విభేదాలు భారతదేశాన్ని వెనక్కి నెట్టివేస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. భారతదేశం గ్లోబల్ లీడర్‌గా ఎదగాలంటే, సమిష్టిగా పని చేయాలన్నారు. దేశంలోని వారు ఒకరితో మరొకరు పోరాడుతుంటే, భారతదేశం విశ్వగురువు ఎలా అవుతుందని ప్రశ్నించారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారతదేశం ప్రపంచ అగ్రగామి అవుతుందా? కేజ్రీవాల్ అడిగారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని.. ఇంత సుదీర్ఘమైన అంతరాయాలు ఉంటే భారతదేశం “విశ్వగురువు” కాజాలదని అన్నారు. ఢిల్లీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ కావాలో, లేక పెద్ద పారిశ్రామికవేత్తల రుణమాఫీ కావాలో దేశ ప్రజలు నిర్ణయించుకోవాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. ప్రతి బిడ్డ ఉన్నత స్థాయి విద్యనభ్యసించినప్పుడే నిజమైన ప్రగతిని సాధ్యమన్నారు.
Ola offer cheap Two wheelers: ఓలా బంఫర్ ఆఫర్.. తక్కువ ధరకే ఎలక్ట్రిక్ టూ వీలర్స్
మరోవైపు తనను చాలా మంది ఎగతాళి చేస్తున్నారని.. ప్రజలకు ఉచితంగా వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నందుకు తనను విమర్శిస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ప్రతి పేదవాడు తమ పిల్లలకు మంచి విద్యను అందిస్తే ధనవంతులు అవుతారని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి చోట్ల లక్ష మొహల్లా క్లినిక్‌లను తెరవడానికి రూ.10,000 కోట్లు అవసరమవుతాయని, దేశంలోని ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించడానికి రూ. 2 లక్షల కోట్ల ఖర్చు అవసరమని కేజ్రీవాల్ తెలిపారు. మన మధ్య మనం పోరాడితే భారతదేశం పురోగమిస్తుందదని, కలిసికట్టుగా పనిచేస్తే ప్రపంచంలోనే భారత్ నంబర్‌వన్ దేశంగా మారుతుందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ తెలిపారు.