కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలించిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లోని భోపాల్లోల బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు తనను సంప్రదించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు. అలాగే కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్లు ఆ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
Bandi Sanjay: కేసీఆర్ పదేళ్ల పాలనలో కుంభకోణాలు, కుతంత్రాలు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండి పడ్డారు.
Raghunandan Rao: రేవంత్ రెడ్డి ఢిల్లీ కేసులు మాట్లాడుతున్నారు మరి గల్లీ కేసులు ఎందుకు మాట్లాడుతలేరని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక క్యాంపు కార్యాలయంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు, అధ్యక్షులు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో కక్ష్య సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 15 రోజులుగా ఎమ్మెల్యేలు, breaking news, latest news, telugu news, satyakumar, cm jagan, bjp
Ravi Kishan: బీజేపీ ఎంపీ నటుడు రవికిషన్ అన్‌పార్లమెంటరీ చట్టాన్ని పరిశీలించాలని డానిష్ అలీపై చర్య తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ కి లేఖ రాశారు. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే వివాదం కొనసాగుతోంది. మతప్రాతిపదికన బిధూరి, డానిష్ అలీపై వ్యాఖ్యానించాడు. ఈ వివాదం బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. చంద్రయాన్ -3 చర్చ సందర్భంగా రమేష్ బిధూరి అతనిపై పార్లమెంట్ లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు…
బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఎదురుదాడి చేశారు. హిమంత బిస్వా శర్మ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రేమ మాత్రమే ఉంది, ద్వేషం లేదు, ప్రేమ దుకాణం వంటి పదాలు తమ నిఘంటువులో లేవన్నారు. ఈ ప్రేమ దుకాణం ఓట్ల కోసం మాత్రమేనని విమర్శించారు.
JDS: కర్ణాటకలో పాత మిత్రుడితో మళ్లీ జేడీఎస్ జతకట్టింది. బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదరింది. రెండు రోజుల క్రితం జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, అతని కుమారుడు నిఖిల్ గౌడ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఎన్డీయేలో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జేడీఎస్, బీజేపీల మధ్య పొత్తు చిగురించింది. రెండు పార్టీలు కలిసికట్టుగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని…
Rahul Gandhi: మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారాయి. ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడనున్నాయి. ఈ ఏడాది చివర్లలో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.