తెలంగాణలో నేడు ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభ నుంచి పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోడీ. అయితే.. మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ నష్టపోతుందన్నారు. 9ఏళ్లల్లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రూ. 9 లక్షల కోట్లు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత 9 ఏళ్లలో కేంద్రం తెలంగాణలో లక్షా 20కోట్ల రూపాయాలు జాతీయ రహదారుల కోసం ఖర్చు చేసిందని ఆయన అన్నారు.
Also Read : Indigo Flight: విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. టాయిలెట్‌లోకి వెళ్లి..!
ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని ఆయన వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ కు సమాంతరంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నామన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయాలు తప్పా.. అభివృద్ధి పట్టదని, ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అడ్మినిస్ట్రేషన్ రాదు.. దీని వల్ల తెలంగాణకు నష్టం.. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే సీఎం కేసీఆర్ రావడం లేదని, ఇక్కడ ముఖ్యమంత్రి దరిద్రపు ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. సిద్ధాంత పరంగా వైరుధ్యాలు ఉన్న సీఎం లు మోడీ కార్యక్రమాలకు వస్తారని, ఈ దరిద్రపు సీఎం మాత్రం రాడని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : PM Modi: పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని ఏం చెప్పబోతున్నారు..?