Danish Ali: పార్లమెంట్ లో గురువారం చంద్రయాన్-3 చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రమేష్ బిధూరిని అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా కూడా సీరియన్ అయ్యారు. మరోసారి ఇవి రిపీట్ అయితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై రమేష్ బిధూరికి బీజేపీ పార్టీ…
Ramesh Bidhuri: బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తన తోటి సభ్యుడు, బీఎస్పీ పార్టీకి చెందిన ముస్లిం ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. లోక్‌సభలో గురువారం చంద్రయాన్-3 మిషన్ పై చర్చ సందర్భంగా బిధూరి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బిధూరి వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునారవృతమైతే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బిల్లును ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తే ఇప్పుడే చేయాలన్నారు. దీనికి డీలిమిటేషన్ ఎందుకని ప్రశ్నించారు. నేటి నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయవచ్చని తెలిపారు. మహిళా రిజర్వేషన్ మంచిదే అయినప్పటికీ.. అందులో రెండు లోపాలున్నాయని తెలిపారు.
MLC Kavitha: రజాకార్ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి బీజేపీ, అధికార బీఆర్ఎస్ మధ్య కొత్త ఫ్లాష్ పాయింట్‌గా మారింది. తెలుగు సినిమా ‘రజాకార్’ని తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. బిల్లుకు మద్దతుగా 215 ఓట్లు రాగా.. రాజ్యసభలో ఒక్కరు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు.
ఈ తొమ్మిది ఏళ్ళ కేసీఆర్ పాలనలో బ్రహ్మండమైన ప్రగతి సాధించినమని అన్నారు కడియం శ్రీహరి. ఇవాళ జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. breaking news, latest news, telugu news, kadiyam srihari, bjp, congress
JDS: మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) రేపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్ణాటక మాజీ సీఎం, దేవెగౌడ కొడుకు కుమారస్వామి గురువారం పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే ఈ దిశగా సీట్ల పంపకాలపై కూడా ఇరు పార్టీలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
JP Nadda: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఓబీసీ కోటాపై వ్యాఖ్యలు చేశారు. దీనికి బదులుగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ట్యూటర్లు(బోధకులు) కూడా రాహుల్ గాంధీకి సాయం చేయరని అన్నారు. గురువారం రాజ్యసభలో నడ్డా మాట్లాడుతూ.. ‘‘నాయకుడు నాయకుడిగా ఉండాలి, ట్యూటర్లు సాయం చేయరు, ట్యూటర్ల స్టేట్మెంట్లు పనిచేయవు’’ అని అన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మూడో రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా కొత్త లోక్‌సభలో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.