రామగుండంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కోరుకంటి చందర్ ని తిరిగి గెలిపిస్తే రామగుండం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్నారు కేటీఆర్. ప్రధాని ఏ మొహం పెట్టుకుని తెలంగాణకి వచ్చారని, రామగుండం వచ్చి సింగరేణిని అమ్మము అన్నారు.. నెలరోజుల్లో సింగరేణి కి చెందిన నాలుగు గనులను వేలం పెట్టారని మండిపడ్డారు. సింగరేణి కి ఆ బ్లాక్ లు ఇవ్వాలని కోరినం.. వేలంలో పాల్గొనమన్నారు తప్ప ఇవ్వలేదు… గుజరాత్ కు ఒక న్యాయం తెలంగాణా కి ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మాలంటే ముందుగా వాటిని నష్టాల్లోకి తోసి తరవాత మోడీ దోస్తులకు కట్టబెడతారు ఇదీ మోడీ నీతి అని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల, ఆర్టీసీ కార్మికుల పాత్ర విడదీయలేందని, సింగరేణికి కేసీఆర్ సర్కారు ఏన్నో చేసింది.. లాభాల్లో 32 శాతం ఇచ్చాము.. దీపావళి బోనస్ కూడా కలిపి 1000కోట్లు కార్మికులకు ఇచ్చామన్నారు కేటీఆర్. డిపెండెంట్ ఉద్యోగ సమస్య పరిష్కరించాం.డిస్మిస్డ్ ఉద్యోగాలు తిరిగి ఇచ్చామని, సింగరేణి స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలు ఇచ్చామన్నారు. జూనియర్ కాలేజీ లేని రామగుండానికి మెడికల్ కాలేజీ ఇచ్చింది కేసీఆర్ అని, కేసీఆర్ అంటే నమ్మకం… మోడీ అంటే అమ్మకం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆరు దశాబ్దాలపాటు ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంటోంది… వ్యారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలకు విలువ ఉందా అని, ఒక్క చాన్స్ అంటున్న కాంగ్రెస్ కి 11 సార్లు చాన్స్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ముద నష్టపు ముసలి నక్క… వంగి వంగి వినయం ప్రదర్శిస్తుందని, పక్క రాష్ట్రాల్లో ఇవ్వనోళ్లు ఇక్కడ ఎలా ఇస్తారన్నారు. బసంత్ నగర్ ఎయిర్ పోర్ట్ ని తెరవాలని కోరితే మోడీ స్పందన లేదని, కాంగ్రెస్ కి అధికారం ఇస్తే ఆరు గ్యారంటీలు ఏమో కానీ మూడు మాత్రం పక్కా ముడుగంటలు కరెంట్, ఏడాదికో సీఎం, స్కామ్ లు మాత్రం పక్కా అని ఆయన అన్నారు.