PM Modi: మహబూనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్‌లైన్, వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నా కుటుంబ సభ్యులారా.. అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సభా వేదికగా ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పసుపు రైతుల కల సాకారమైంది. సభా వేదికగా పసుపు బోర్డుపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మోడి ప్రకటించారు. పాలమూరు సభ సాక్షిగా ప్రధాని ప్రకటించారు. దీంతో పాటు ములుగు జిల్లాకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ప్రధాని మోడీ సభా వేదికగా ప్రకటించారు. సమ్మక్క సారక్క పేరుతో రూ.900 కోట్లతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హెచ్‌సీయూ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.
Also Read: Big Breaking: తెలంగాణకు పసుపు బోర్డు.. ములుగు జిల్లాకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ
పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభకి ముందే మాట్లాడిన సందర్భంలో ప్రధాని మోడీ ఓ టీజర్ వదిలారు. అంతా ప్రజాగర్జన సభలోనే మాట్లాడుతానంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ప్రధాని మోడీ ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కామ్ గురించి చెబుతారా..? తెలంగాణకు ఏమేమి చేశారనేది చెప్పనున్నారు. తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించడానికి మోడీ ఏం మాట్లాడుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సభలో ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నా కుటుంబ సభ్యులారా.. అంటూ తెలుగులో మాట్లాడి తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు ప్రధాని మోడీ. కాసేపట్లో ప్రారంభం కానున్న పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని మోడీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకు పడే అవకాశం ఉందని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.