సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని పూర్తిగా నిర్మూలించాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ మారుతారు అనే ప్రచారంపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. నేను పార్టీ మారడం లేదు.. జరుగుతున్నది ప్రచారం మాత్రమే అందులో వాస్తవం లేదు.. ఏఐసీసీలో నాపై చర్చ జరిగినట్టుగా సమాచారం ఉంది.. కాంగ్రెస్ పార్టీ నేతలను నేను కలవ లేదు అని ఆయన తెలిపారు.
బషీరాబాగ్, కింగ్కోఠి లోని భారతీయ విద్యాభవన్, కులపతి మున్షీ సదన్" లో జరిగిన 9వ "రోజ్ గార్ మేళా" కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు కిషన్ రెడ్డి. breaking news, latest news, kishan reddy, rozgar mela, bjp,
దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిర్ణయించడం దారుణం అని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్గా ఎలా ఉంటారు?.. అని ఆయన ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవకాశం నాకు కల్పించారు.. నాకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో, పల్లా రాజేశ్వర్ రెడ్డితో, ముఖ్య నాయకులు అందరితో మాట్లాడుతున్నాను అని ఆయన తెలిపారు.