Bandi Sanjay: బీసీలను కేటీఆర్ అవమానించారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనగానే గుణం గుర్తుకొచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలి అంటూ ఆయన పేర్కొన్నారు. తక్షణమే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆ తరువాతే బీఆర్ఎస్ ఓట్లడగాలన్నారు. ఒవైసీ… ఈ కొత్త వరుసలేంది అంటూ ప్రశ్నించారు. డబ్బు సంచులందగానే వావివరుసలు మారిపోయినయా అంటూ తీవ్రంగా విమర్శించారు. కరీంనగర్‌లో పోటీ చేస్తానని చేసిన ప్రగల్భాలేమైనయ్ అంటూ మండిపడ్డారు.
Also Read: Venkaiah Naidu: ఏబీవీపీ వల్లే అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగాను
బండి సంజయ్ మాట్లాడుతూ..” డిపాజిట్లే రాని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎట్లా అవుతుంది?. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్కక్కై బీజేపీ గ్రాఫ్‌ను తగ్గించే కుట్ర. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగరేయబోతున్నం. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. పేదల పార్టీ బీజేపీకి, దోపిడీ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య జరుగుతున్న పోరాటమిది.” అని బండి సంజయ్ అన్నారు.