మహరాష్ట్రలో 7 గంటలు, కర్ణాటకలో మూడు గంటలే కరెంట్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. డీకే శివకుమార్ అక్కడే కరెంట్ ఇవ్వడం లేదు తెలంగాణ కు ఏం మొహం పెట్టుకొని ప్రచారం చేస్తారన్నారు. అక్కడి రైతులు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ కు ఓట్లు వేయవద్దని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అమిత్ షా వచ్చి సీసీఐ నుంచీ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తకి టికెట్ ఇచ్చారని, కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్ జప్తు చేయాలన్నారు. రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ ను రైతులంతా బొంద పెట్టాలని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆర్టీపీ బిల్లుకు గవర్నర్ ను అడ్డు పెట్టుకొని బీజేపీ అడ్డుపడిందన్నారు. ఆర్టీసి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే అని మంత్రి హరీష్ రావు అన్నారు.
Also Read : IRCTC: దక్షిణ భారత తీర్థయాత్రల స్పెషల్.. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్
24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. బీజేపీ వాళ్ళు కరెంటుకు మీటర్లు పెట్టాలని, బిల్లులు వసూలు చేయాలని అంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం ఒప్పు కోవడం లేదని.. అందుకే రాష్ట్రంపై కేంద్రం అక్కసు పెంచుకుందన్నారు. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టిందన్నారు. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ అని.. అలాంటి రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఖానాపూర్‌లో జాన్సన్‌ను గెలిపించాలని హరీష్ రావు కోరారు. జాన్సన్ తమ కుటుంబ సభ్యుడని.. అభివృద్ధి పూచీ తమదని అన్నారు. పోడు పట్టాలు రాని రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. బీజేపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.
Also Read : IRCTC: దక్షిణ భారత తీర్థయాత్రల స్పెషల్.. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్