విజయవాడలో శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షులతో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాల మేరకు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడుతున్నానని ఆమె వెల్లడించారు.
నిజామాబాద్ అర్బన్ రోడ్ షో లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... గులాబీ జెండా రాకముందు ఎలా ఉండే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని, నాడు నీళ్ళ కోసం ఎంతో గోస. ఇప్పుడు అలాంటి.. breaking news, latest news, telugu news, big news, harish rao, bjp, brs
Bandi Sanjay: నిర్మల్ జిల్లా ముధోల్ ప్లానింగ్ ఏరియాలోని భైంసా పట్టణంలో ఇవాళ నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరుకానున్నారు.
నేడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఇంటింటికీ చేరేలా కమలం పార్టీ నేతలు ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలంగఆణ బీజేపీ రాష్ట్ర అధక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో కాంగ్రెస్ బహిరంగసభ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జయ భేరి సభకు అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణా వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాక్రే హాజరయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్పై ఎంపీ, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దరఖాస్తు చేసుకోకపోయినా పరీక్షలకు అనుమతిస్తారా కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. దరఖాస్తు చేయకుండా మెడికల్ కాలేజీలెట్లా మంజూరు చేస్తారో చెప్పు అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Vijayashanti Joins in Congress Party: రోజురోజుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన రావడంతో నేతల్లో అసంతృప్తులు, పార్టీల మార్పులతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల ఆమె బీజేపీకి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె తిరిగి తన సొంతగూటికే చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. అవే నిజం చేస్తూ శుక్రవారం విజయ శాంతి హస్తం పార్టీలో చేరారు. Also…
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి రోజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 13 రోజులే ఉంది. ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీల అభ్యర్థులు.. తమ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రచారంలో అంత్యంత ప్రాముఖ్యత కలిగిన మేనిఫెస్టోను ఇప్పటివరకు బీజేపీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రేపు నవంబర్ 18 అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోకు ఇంద్రధనుస్సుగా నామకరణం చేశారు. ప్రధానంగా ఏడు అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్టు…