Andela Sriramulu Yadav: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హీట్ పెంచుతుండగా.. మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు.. రోజురోజుకీ ఆయనకు ప్రజల నుంచి, యువత నుంచి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం కావడంతో.. అందరి చూపు ఆ నియోజకవర్గంపై ఉంది.. ఇక, ఆమెకు ఎదురుగాలి వీస్తున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి.. ఈ రోజు బీజేపీ కార్యాలయంలో.. అందెల శ్రీరాములు యాదవ్ ని కలిసి మద్దతు ప్రకటించింది నిరుద్యోగ జేఏసీ.. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు అంతా బీజేపీకి సపోర్ట్ చేసి.. అందెల శ్రీరాములు యాదవ్ కి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు నిరుద్యోగ జేఏసీ నేతలు.
మరోవైపు.. అందెలా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయి అని అనుకున్నారు.. కానీ, తెలంగాణ వచ్చాక ఎవరి బతుకులు మారాలేదు.. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని దుయ్యబట్టారు.. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లో ఎంతోమంది కష్టపడి చదువుకున్న విద్యార్థులు.. తమ ప్రాణాలు ఇచ్చి సాధించుకున్న తెలంగాణ ఎవరి పాలయ్యింది..? అంటే తెలంగాణ కేసీఆర్ పాలయ్యిందని విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులు తమ ప్రాణాలు లెక్కచేయకుండా జై తెలంగాణ అని పిట్టల వలె రాలిపోతుంటే.. అప్పుడు హోంమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి.. జై తెలంగాణ అని అనమంటే అనలేదని గుర్తుచేశారు.. ఇక ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా పదిమందికి జాబులు ఇవ్వలేదు, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేకపోయారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ వాప్తంగా నిరుద్యోగులు అంతా బీజేపీకి మద్దతు తెలుపుతున్నందుకు నిరుద్యోగులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ మహేశ్వరం అభ్యర్థి అందెలా శ్రీరాములు యాదవ్.