వరంగల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నానని.. బీసీలకు సాధికారికత తెలంగాణ కోరుకున్నామని తెలిపారు. ధన బలం లేకున్నా.. మీ ధైర్యం, మీ సహకారంతో జనసేన నడిపిస్తూ వస్తున్నానని చెప్పారు. 2014లో మోదీని ప్రధానిగా చూడాలని ఆయనకు అప్పుడు బలంగా మద్దతు ఇచ్చానన్నారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఇక్కడి బీజేపీ నేతలకు అదే మద్దతు ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ప్రదీప్ రావును మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.
YS Sharmila: కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది..: వైఎస్ షర్మిలా
ఇన్ని రోజులు తెలంగాణా ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదని నన్ను చాలా మంది అడిగారని పవన్ కల్యాణ్ తెలిపారు. కానీ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం పైన విమర్శలు చేయవద్దు అని అనుకున్నానని చెప్పారు. ఉద్యమ పోరాటంతో, సకల జనుల సమ్మెతో, ప్రజల బలిదానంతో సాధించిన తెలంగాణ రాష్టంలో తప్పులు లేకుండా ఉంటుంది అని భావించానని చెప్పుకొచ్చారు. దశాబ్దం పాటు పెదవి మెదపలేదని.. అయితే 10 ఏళ్ళు గడిచిన తెలంగాణలో మార్పు రాలేదని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నపుడు నేను తెలంగాణకు వస్తా అనుకున్నా.. ఇప్పుడు ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నరు అందుకే వచ్చానని పేర్కొన్నారు.
ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణాలో అలాగే తిరుగుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో తిరుగుతని అన్నారు. మహిళ మాన, ప్రాణాల కోసం తెలంగాణలో పర్యటిస్తానని తెలిపారు. తెలంగాణలో కూడా జనసేన ఉంటుందని పవన్ అన్నారు. బలిదానాలు ఇచ్చిన తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో కమిషన్ తీసుకుంటున్నారని నేతలు చెబుతున్నారు.. అంటే ఇక్కడ అవినీతి ఎంత ఉందో అర్ధం అవుతుందని పవన్ తెలిపారు. ఆదిలాబాద్ లోని తండాలకు వెళ్ళితే కనీసం త్రాగడానికి నీళ్లు కూడా లేవన్నారు. అలాగే తెలంగాణ యువత పూర్తిగా మనసూర్తిగా కోరుకుంటే అనుకున్నది సాధించవచ్చని పవన్ కల్యాణ్ తెలిపారు.
Captain Miller: ఏది సామీ ఈ అరాచకం.. ధనుష్ విశ్వరూపం.. దడుచుకుంటారేమో
ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అక్కడ గుండాల పాలన నడుస్తోందని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. తెలంగాణలో కమీషన్ల రాజ్యం నడుస్తోందని పవన్ తెలిపారు. కాగా.. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను ఒక్కడినని అన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుంది.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్ తెలిపారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించండని కోరారు.