Kishan Reddy: దమ్ముంటే మెడికల్ కాలేజీలకు రాసిన ఉత్తరాలు బయటపెట్టు.. కేసీఆర్‌కు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ పెత్తనం లేనటువంటి పార్టీ అధికారంలోకి రావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం బీజేపీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే అవినీతి, అస్థిరత ఉంటుందని, బీఆర్ఎస్ కుటుంబ పెత్తనం పార్టీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అని ఎద్దేవా చేశారు. అవినీతి, బంధుప్రీతి ఆ పార్టీల విధానమని.. ధర్మం, దేశం బీజేపీ విధానమన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు రావాలంటే బీజేపీ కి ఓటు వేయాలన్నారు. తల తోక లేకుండా మాట్లాడటం కేసీఆర్ కుటుంబానికి అలవాటు.. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మెడికల్ కాలేజీలకు రాసిన ఉత్తరాలు బయట పెట్టాగలడా అని సవాలు విసిరారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఆ దమ్ము ఉందా?
సిగ్గు లేకుండా కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని, అసలు మెడికల్ కాలేజీలకి దరఖాస్తు చేసుకోలేదని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్ ఎందుకు ఆలస్యం అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి BC సీఎం అంశం… బీసీ సామాజిక వర్గంలోని ప్రతి ఇంటా చర్చ జరుగుతుందని, ఇప్పటి వరకు బీసీ సీఎం కాలేదన్నారు. బీసీ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి… ఇది బీజేపీకి అదనంగా కలిసి రానుందన్నారు. బీసీ సీఎంను చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా? అని సవాలు విసిరిరారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ బీసీలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని, దలీతుడిని సీఎం చేసే దమ్ము ధైర్యం కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ను సీఎం చేసినట్టు ఫాం హౌజ్‌లో పడుకొని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. మహిళ మంత్రిని పట్టుకుని సిగ్గుందా అని మాట్లాడానికి కేసీఆర్‌కు సిగ్గుందా అని ధ్వజమెత్తారు. నిర్మల సీతారామన్ అన్ని వాస్తవమే మాట్లాడారన్నారు.
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
తెలంగాణలో మోదీ పర్యటన
ప్రధాని నరేంద్రమోది తెలంగాణ పర్యటనపై కిషన్ రెడ్డి స్పందించారు. త్వరలో ప్రధాన మంత్రి తెలంగాణలో పర్యటిస్తారన్నారు. 25,26,27 తేదీల్లో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ కి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులారా డిసెంబర్ మూడు వరకు వడ్లను అమ్ముకొకండి.. వరి కనీస ధర 3,100 రూపాయలు బీజేపీ ఇస్తుందని పేర్కొన్నారు. మూడో తేదీ తరవాత బీజేపీ అధికారంలోకి వస్తుంది.. వడ్లను కొంటుందన్నారు. రైతుల దగ్గర నుండి డబ్బుల వసూల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదని చెప్పారు. రేపు బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచిత కరెంట్ ఇస్తుందన్నారు. కంపెనీలు తీసుకునేవి, దొంగతనంగా వాడుకునే కరెంట్ అంత ఈ ప్రభుత్వం రైతుల ఖాతాలో వేస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!