Rajasthan: రాజస్థాన్ సీఎంపై ఉత్కంఠ..60 మంది ఎమ్మెల్యేలకు వసుంధర రాజే ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేసింది బీజేపీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 115 సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో బీజేపీ తరుపున ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజేనే ముఖ్యమంత్రిగా చేస్తారా..? లేకపోతే కొత్తవారిని సీఎం సీటు వరిస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే ఈ సారి వసుంధర రాజేకు బీజేపీ చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు అంతర్గత వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో యోగి ఆదిత్యనాథ్ తరహాలో రాష్ట్రంలో కూడా యోగి బాబా బాలక్ నాథ్‌కి బీజేపీకి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరొకొందరి పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
Read Also: Kamal Nath: “ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు రాలేదు”.. ఇది ఎలా సాధ్యం..
ఇదిలా ఉంటే వసుంధర రాజే సీఎం సీటు కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం 68 మంది ఎమ్మెల్యేలకు వసుంధర రాజే ఫోన్ చేసి తనను కలవాలని చెప్పినట్లు తెలుస్తోంది. బలప్రదర్శనలో భాగంగా రాజేని ఇప్పటి వరకు 28 మంది ఎమ్మెల్యేలు కలిశారని, అయితే ఇందులో కొంతమంది స్వతంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలు మాత్రం తాము మర్యాదపూర్వకంగా కలిశామని, పార్టీ నాయకత్వం రాజేని రాష్ట్రంలో సీఎం పదవికి ఎంచుకుంటే మద్దతు ఇస్తామని చెప్పారు.
వసుంధర రాజేతో పాటు ఝల్రాపటన్ స్థానం నుంచి గెలిచిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మెఘ్వాల్, బాబా బాలక్ నాథ్, వసుంధర రాజేలాగే రాజవంశీయురాలైన దియా కుమారి కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ అరుణ్ సింగ్, బీజేపీ చీఫ్ సీపీ జోషి పార్టీ హైకమాండ్‌ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో వీరు భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు షెకావత్, బాలక్ నాథ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. వసుంధర రాజే 2003 నుంచి 2008 వరకు, 2013-18 వరకు రెండు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!