CEC bill: ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభలో విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లును ఆమోదించుకుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు కేంద్రమంత్రి ఉండనున్నారు. అయితే, కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి బదులు కేబినెట్ మంత్రిని చేరుస్తూ ఈ బిల్లును కేంద్రం రూపొందించింది. ఆ మంత్రి పేరును కూడా ప్రధాన మంత్రినే నామినేట్ చేయనున్నారు. తద్వారా 1991 చట్టాన్ని కేంద్ర సర్కార్ పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అయితే, గత మార్చి నెలలో సుప్రీం కోర్టు ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసే వరకు.. ప్రధాన మంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐ కలిసి ఈ నియామకాలు చేపట్టాలని’’ తీర్పు వెల్లడించింది.
Read Also: Bhajan Lal Sharma: “సర్పంచ్ నుంచి సీఎం దాకా”.. రాజస్థాన్ సీఎం అద్భుత రాజకీయ ప్రస్థానం..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాగా, ఇవాళ రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. విపక్షాల అభ్యంతరాలు బదులు ఇస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఇక మీదటా స్వతంత్రంగానే పని చేస్తుందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఉండబోతుందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికార విభజనకు తగ్గట్లుగానే ఉందని తెలిపారు. ఇక, రాజ్యసభ ఆమోదం పొందిన సీఈసీ బిల్లు ప్రకారం.. ఈసీ, ఈసీ సభ్యుల నియామకాల కోసం ప్రధాని నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటవుతుంది. దీంట్లో లోక్‌సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉండనున్నారు. ఈ ప్రతిపాదిత కమిటీ పైనా విపక్షాలు అభ్యంతరం చేశాయి.
Read Also: CM Revanth Reddy: పకడ్బందీగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ..
అయితే, వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఆగస్టు 10వ తారీఖున రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. అప్పుడు దీనిపై ఎలాంటి చర్చ కొనసాగలేదు.. ఆ తర్వాత సెప్టెంబర్ లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని అనుకున్నారు.. కానీ, అది సాధ్యం కాలేదు.. తాజాగా సవరణలతో కూడిన ఈ బిల్లు ఇవాళ రాజ్యసభలో ప్రవేశ పెట్టడంతో పాటు చర్చ జరిగింది.. దీనికి విపక్షాల అభ్యంతరాల చేప్ప్తుండగానే ఆమోదం పొందింది.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!