మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. 370 సీట్లు గెలుస్తాం అని బీజేపీ స్పష్టంగా చెప్తోంది... జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కాబట్టి బీజేపీ అలా అంటుందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్‌ను విభజించి ముక్కలు చేశామని బీజేపీ గొప్పగా చెప్పుకుంటుంది.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, విదేశీ సంస్థలకు దేశాన్ని అమ్మడం గొప్ప విజయంగా బీజేపీ భావిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఖూనీ చెయ్యడం కూడా గొప్ప…
మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎక్కడ యుద్దం చేస్తారో వారికే తెలియదని సెటైర్లు వేశారు. అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు కి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాలలో పోటీకి సిద్దమని, జనసేన ఎన్ని చోట్ల యుద్దానికి…
కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం దేవాలయాలు కూడా పన్ను కట్టాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఉద్రిక్త కొనసాగుతుంది. ఇక, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ మరోసారి గళం విప్పింది.
తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుతమైన జాతీయ రహదాలను నిర్మించింది.. అలాగే రైల్వేను కూడా అభివృద్ధి చేస్తుందన్నారు. మరోవైపు.. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు ప్రకటించిందని తెలిపారు. ప్రతి పేద వాడి ఇంట్లో టాయిలెట్, వంటగ్యాస్, బియ్యంతో పాటు పేదవాడి…
ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈరోజు రిటర్నింగ్ అధికారి నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యసభకు తనను పంపినందుకు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. రాజ్యసభ ఎంపీ అవ్వడం బహుమతి కాదు.. బాధ్యత పెరిగిందని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు అనగానే నాయకుల ఇళ్లకు ఈడీ అధికారులు…
ఎన్నికల షెడ్యూల్ కు గడువు మరో పక్షం రోజులే ఉన్నందున ఆ లోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తుశుద్దిని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా కన్పిస్తోందన్నారు. ‘‘6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలకు 70 రోజుల గడువు ముగిసింది. నెలాఖరు…
మూడోసారి మోడీని ప్రధాని చేసేందుకు సంకల్పించిన యాత్రే విజయ సంకల్ప యాత్ర అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసిన వ్యక్తి మోడీ అని పేర్కొన్నారు. కారణ జన్ముడు మోడీ అని కొనియాడారు. రాముడు లేడు, రామసేతువు మీదా అంటూ కాంగ్రెస్ నిసిగ్గూగా మాట్లాడుతోందని ఆరోపించారు. నిలువ నీడ లేని వారికి 4 కోట్ల ఇళ్లు కట్టించిన వ్యక్తి మహానుభావుడు మోడీ అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్…