Assam: బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ముస్లిం వివాహ చట్టం రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం అతిపెద్ద చర్చకు దారి తీసింది. ఇది రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుకు ముందడుగుగా పరిగణించబడుతోంది. అయితే, బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుల్ రషీద్ మండల్ మాట్లాడుతూ.. హిమంత సర్కార్ ముస్లిం వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. వారు హిందువులకు అనుకూలంగా ఉన్నారని, ముస్లింలను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐయూడీఎఫ్ నేత రఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూసీసీని తీసుకువచ్చే ధైర్యం ప్రభుత్వానికి లేదని, ఇది ముస్లింలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.
Read Also: Maritius Flight: రన్‌వేపైనే నిలిచిన విమానం.. ఏసీలు ఆఫ్.. ఊపిరాడట చిన్నారులు..!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. కొత్త చట్టంతో రాష్ట్రంలో మంచి వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో యూసీసీని తీసుకువచ్చామని, ఇప్పుడు అస్సాంలోని హిందువులు, ముస్లింలకు ఒకే చట్టం ఉంటుందని అన్నారు. బాల్యవివాహాలను అంతమొందించే ప్రయత్నమని బీజేపీ చెబుతోంది. అస్సాం క్యాబినెట్ శుక్రవారం అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల చట్టం-1935ని రద్దు చేయడానికి ఆమోదం తెలిపింది. చట్టం ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 కనీస వివాహ వయసు. అయితే, ముస్లిం వివాహ చట్టం ప్రకారం ఈ వయసు లేకున్నా వివాహం చేసుకునే నిబంధనలు దీంట్లో ఉన్నాయి, దీంతో బాల్య వివాహాలను నిర్మూలించే లక్ష్యంలో అస్సాం ఈ చట్టాన్ని రద్దు చేసిందన సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ ద్వారా ప్రకటించారు. బహుభార్యత్వానికి స్వస్తి పలికే బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు గతంలో సీఎం చెప్పారు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!