జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిరంజీవి లాగే పవన్ కల్యాణ్ తన పార్టీని అమ్ముకుంటున్నాడు.. తమ్ముడు కల్యాణ్ ఎంపీగా పోటీ చేసి వేల కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాడు అంటూ ఆరోపించారు. ఇక, పవన్ తనకు ఒక్క సీటు ఇచ్చినా చాలనుకుంటాడు.. నాదెండ్ల మనోహర్‌కు సీటు లేదన్నా ఒకే అంటారంటూ సెటైర్లు వేశారు.
Haryana: హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. ఛండీగఢ్‌లో గవర్నర్ బండారు దత్రాత్రేయ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ కూడా ఉన్నారు. బీజేపీ-జేజేపీ మధ్య ఎంపీ సీట్ల షేరింగ్‌పై విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రిని మారుస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా సవాలు విసిరారు. కాంగ్రెస్ చేసిన స్కాంల లిస్ట్ పంపిస్తా.. అవినీతి జరిగిందా లేదా రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని దేశంలో ఏకైక ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. సీఎంగా చేసినప్పుడు కూడా మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ఏమి చేయలేదని.. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ ఇచ్చింది మోడీ సర్కారని…
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఏ క్షణములోనైనా సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. సోషల్ మీడియాతో ప్రతి ఇంటికి మన సందేశం వెళ్ళాలి.. దేశ ప్రజలు మూడోసారి మోడీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని పేర్కొన్నారు. రైతులు, పేదలు.. ఎవరి దగ్గరికి వెళ్లినా మోడీ మోడీ అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి.. కానీ మోడీ…
హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ- జేజేపీ కూటమిలో విభేదాలు రావడంతో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ రాజీనామా చేశారు. ఇక, సాయంత్రం 4 గంటలకు ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ- జేజేపీ కూటమిలో విభేదాలు వచ్చిన.. నేపథ్యంలో సీఎం (Haryana CM) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) ఇవాళ రాజీనామా చేశారు.