Kishan Reddy: హైదరాబాద్ లో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో బీజేపీ గెలుపుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలో పర్యటన చేస్తూ కేంద్రం అభివృద్ధిపై ఇంటింటికి తెలిజేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలకు కేంద్ర పథకాలు అందుతున్నాయా? లేదా? వివరంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ ఉదయం నగరంలోని పలు డివిజన్లలో పలు ప్రారంబోత్సవాల్లో పాల్గొని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం సనత్ నగర్ అసెంబ్లీలో పవర్ బోర్ వెల్ ప్రారంభం అనంతరం మైసమ్మ దేవాలయం, సనత్ నగర్ డివిజన్ లో ఆర్ వో ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం బాపూనగర్, అమీర్ పేట్ డివిజన్ ఓపెన్ జిమ్ ల ప్రారంభించారు. బేగంపేట-అమీర్ పేట డివిజన్లో ఎస్ఆర్ నగర్ వాటర్ ట్యాంకు పార్కు, దివ్యశక్తి అపార్ట్ మెంట్స్, శాంతి బాగ్ అపార్ట్ మెంట్స్, ప్రభుత్వ మహిళా కాలేజీ, మోండా డివిజన్ గాస్ మండి స్పోర్ట్స్ గ్రౌండ్, న్యూ బోయిగూడా – బన్సీలాల్ పేట్ డివిజన్ లో జీహెచ్ ఎంసీ గ్రౌండ్, ప్రారంభించారు.
సికింద్రాబాద్ ఫ్రారంభోత్సవాలు..
* సికింద్రాబాద్ అసెంబ్లీలో సాయినగర్, అడ్డాగుట్ట డివిజన్ -పవర్ బోర్ వెల్ ప్రారంభం..
* కొండారెడ్డి కాలనీ పార్కు, అడ్డగుట్ట డివిజన్ -ఓపెన్ జిమ్ ప్రారంభోత్సం..
* వినోభా నగర్, లాలాపేట్, తార్నాక డివిజన్-కమ్యూనిటీ హాల్ ప్రారంభం..
* వినోభా నగర్, లాలాపేట్, తార్నాక డివిజన్ -పవర్ బోర్ వెల్స్ ప్రారంభాలు..
* లేబర్ అడ్డా, లాలాపేట్, తార్నాక డివిజన్-ఓపెన్ జిమ్ ల ప్రారంభం..
* నాన్ టీచింగ్ హోమ్ ఓయూ, టెలిఫోన్ భవన్ పక్కన, తార్నాక డివిజన్-కీమ్తీ కాలనీ పార్కు,
ఖైరతాబాద్ అసెంబ్లీ ప్రారంభోత్సవాలు..
రామయ్య ఉస్తాద్ వ్యాయామశాల, వీటి కాలనీ, పంజాగుట్ట, వెంకటేశ్వర కాలనీ డివిజన్- ఓపెన్ జిమ్ ల ప్రారంభోత్సవాలు..జూబ్లీ హిల్స్ డివిజన్- పర్వత ఆంజనేయ స్వామి దేవాలయం దర్శన అనంతరం.. సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టుకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4.55 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టు నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 5.15 గంటలకు మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షోలో పాల్గొంటారు.
West Bengal : ఏం ఐడియా రా బాబు.. పైకి చూస్తే లగ్జరీ బస్సు.. లోపల మాత్రం ఆవుల అక్రమ రవాణా