BJP: 2024 లోక్సభ ఎన్నికలకు పకడ్బందీ వ్యూహాలు రూపొందిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాలను క్రాస్ చేస్తుందని ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. ఢిల్లీలో ఆప్తో బీజేపీ పోటీ పడబోతోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో అభ్యర్థుల విషయంలో బీజేపీ కీలకంగా…
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు విడిపోయినట్లు డ్రామాలు ఆడుతున్నాయని, అయితే రహస్య సంబంధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బుధవారం పొల్లాచ్చిలో జరిగిన డీఎంకే సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఏఐడీఎంకే తమ పొత్తు చెడిపోయిందని చెబుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, వారి మధ్య రహస్య సంబంధం ఉందని ఆరోపించారు.
BJP 2nd List: లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో బీజేపీ తన రెండో జాబితాను ప్రకటించింది. గతవారం 195 మందితో తొలిజాబితా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, బుధవారం 72 మందితో రెండో జాబితాను ప్రకటించింది. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోని పలు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. Read Also: Aamir Khan: ఆమెతో శృంగారం.. అందుకే విడాకులు.. మాజీ భార్య…
Tamil Nadu: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన తమిళనాడు మంత్రిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికార డీఎంకే పార్టీకి చెందిన నేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడులో వివాదాస్పదం అయ్యాయి. మంత్రి అన్బరసన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో అధికార డీఎంకేపై బీజేపీ విరుచుకుపడుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు, సాగు నీరు, విద్యుత్పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల అవినీతిపై విచారణ చేపడితే కేసీఆర్కు వణుకు పుడుతోందని ఆయన విమర్శించారు.
Manohar Lal Khattar: హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ తన ఎమ్మెల్యే పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేయడం గమనార్హం ఖట్టర్ 2014 నుంచి కర్నాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని చెప్పారు. కర్నాల్ లోక్సభ అభ్యర్థిగా ఖట్టర్ని బీజేపీ బరిలోకి దింపొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ సమాజం చీదరించుకుని ఓడగొట్టినా కేసీఆర్కు బుద్ధిలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అబద్దాలు మాట్లాడుతూ ప్రజలని మళ్లీ మోసగిస్తున్నారని ఆయన విమర్శించారు. మళ్లీ మాయ మాటలతో తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.