జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని చీల్చడమే లక్ష్యంగా బిజెపి మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తాం అనడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. మోడీకి ఆదాని, అంబానీ అండ రాహుల్ గాంధి కి ఎవరు ఉన్నారని, దేశ సమగ్రత, దేశ…
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి ఏర్పాటు చేసిన సభకు హాజరైన నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7 ఆదివారం నాడు సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ సిబ్బందితో కలిసి వెంకట్రామిరెడ్డి ఓ సభను ఏర్పాటు చేసారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు,…
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషమని.. వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు నేతన్నల డిమాండ్లన్నీ పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారని.. అధికారం కోసం అడ్డదారులు తొక్కరని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ, అమిత్ షా విధానమని ఆయన విమర్శించారు.
దేశంలో మొదటి, రెండో దశ సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే దేశంలోని రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ల అభ్యర్థిత్వంపై కొన్ని ముఖ్యమైన స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ఇప్పటి వరకు 418 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 92 మంది సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లను పార్టీ రద్దు చేసింది.
ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ను 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి.. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు, శ్రేణులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ పార్లమెంట్ సీటుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తన…
అధికారాన్ని కోల్పోవడం ఖాయమని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా విమర్శలు గుప్పించారు. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా, క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు అని మండిపడ్డారు.