మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని బీజేపీ పదే పదే ఆరోపణలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అధికార (బీజేపీ)పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ వేదికలపై పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల చరిత్ర మారదని తెలుసుకోవాలని రాహుల్ అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ మొదట ముఖ్యమంత్రి అన్నాడు.. ఆ తర్వాత మంత్రి అన్నాడు.. ఇప్పుడు ఎమ్మెల్యే చేయమంటున్నాడు.. ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు రేపు కార్పొరేటర్ స్థాయికి వస్తాడు అని పేర్కొన్నారు.
గత సోమవారం నాడు తన నియోజక పరిధిలోని శ్రిహిపుర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. అక్కడ ఆయన ఓ యువతి అందరు చూస్తుండగానే ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారన్నారు బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి. ఇవాళ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అనుకుంటున్నారన్నారు. పిసిసి పదవీ వేరే.. సిఎం పదవీ వేరే అని, సీఎం పదవి కోసం పది మంది పోటీపడుతున్నారన్నారు మహేశ్వర్ రెడ్డి. సెకండ్ పోజిషన్…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, కవ్వంపెల్లి సత్యనారాయణలు దర్శించుకున్నారు.
ఈ ఎన్నికలు తెలంగాణకో.. సికింద్రాబాద్ కో సంబంధించినవి కావు.. దేశం కోసం జరిగే ఎన్నికలు ఇవి అని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్ పైన గల్లీ టూ గల్లీ కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కొట్లాడి 1000 కోట్ల నిధులు తెచ్చానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
నేడు, రేపు గోదావరి జిల్లాల్లో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఈ రోజు తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో.. రేపు పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం సాగనుంది..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో రేపు జరప తలపెట్టిన ‘నేతన్నకు అండగా భరోసా దీక్ష’ కు ప్రభుత్వం దిగివచ్చిందని, ఇది బండి సంజయ్ కుమార్ పోరాటే ఫలితమేనని , నేత కార్మికుల సమస్యలు, డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపినందున, దీక్షా కార్యక్రమాన్ని ఎంపీ బండి సంజయ్ వాయిదా వేస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ నేతన్నల ప్రధాన…