Congress: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి. సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే పలువురు కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.
మిర్యాలగూడలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. లోక్ సభలో పోటీకి టికెట్ కేటాయింపులలో మాదిగలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ భావిస్తుందని తెలిపారు. బీసీలు సైతం కాంగ్రెస్ పార్టీని ప్రథమ శత్రువుగా భావించాలని పిలుపునిస్తోందని అన్నారు. తెలంగాణలో అసలు మాదిగలు లేనట్లుగా భావించి.. పూర్తిగా మాదిగలకు అన్యాయం చేసిన…
Congress: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘‘ముస్లిం లీగ్’’ భావజాలం ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన తరుణంలో ఆయన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. తన కుర్చీని కాపాడుకోవడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో దిక్కుమాలిన మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు.. ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను బొంద పెట్టారని రాణి రుద్రమ మండిపడ్డారు. దేశ ప్రజలు మోడీకి ఓటు వేయాలని చూస్తున్నారు.. రాహుల్ గాంధీని ఆదర్శంగా…
ఎన్నికల సమయంలో కనిపించే హడావుడి మణిపుర్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక, ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులు మాత్రమే కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోఫై అస్సాం ముఖ్యంత్రి హిమంత బిశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గమనిస్తే.. భారత్‌లోని ఎన్నికల కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు తగినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి అయితే దేశం ఇంకోసారి సార్వత్రిక ఎన్నికలను చూడబోదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (7 ఏప్రిల్ 2024) బీహార్‌లో పర్యటించనున్నారు. ఇక, బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్‌కు మద్దుతుగా ప్రచారం చేయబోతున్నారు. అలాగే, నవాడాలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.