Rajnath Singh: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విధించిన ‘ఎమర్జె్న్సీ’పై రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణ బీజేపీలోని ఆ ఇద్దరు ముఖ్యులకు తత్వం బోథపడిందా? అసెంబ్లీ ఎన్నికల టైంలో హెలికాప్టర్స్ వేసుకుని తిరిగి మరీ నానా హంగామా చేసిన నేతలు ఇప్పుడెందుకు నియోజకవర్గం దాటి బయటికి రావడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ ఉన్నా… యాక్ట్ లోకల్ అన్నట్టుగానే వ్యవహారం ఉంది ఎందుకు? ఇంతకీ… ముందు ఇంట గెలవాలనుకుంటున్న ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళ మారు మనసుకు కారణాలేంటి? అసెంబ్లీ ఎన్నికల అనుభవాలతో లోక్సభ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోంది తెలంగాణ బీజేపీ.…
Misa Bharti: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతీ ప్రధాని నరేంద్రమోడీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి.
Tamil Nadu: లోక్సభ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తమిళనాడులో అధికార డీఎంకే వర్సెస్ బీజేపీలా రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
గత ప్రభుత్వంలో దుశ్శాసన పాత్ర పోషించిన ఎంఐఎం ప్లేట్ పిరాయించి కాంగ్రెస్ పంచన చేరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటి వ్యాపారాలు చేస్తూ, దౌర్జన్యంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పార్టీ ఎంఐఎం అని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ కి చీకటి దందాలకు అండా కావాలి, బీజేపీ ఓడి పోవాలన్నారు కిషన్ రెడ్డి.…
West Bengal: బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ యువతి బుగ్గపై ముద్దు పెట్టుకోవడం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పద అంశంగా మారింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మె్ల్యే అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ కనకదుర్గ టెంపుల్ చైర్మన్ పైలా సోమి నాయుడు ఈరోజు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. సొంత జిల్లా నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. దేశ రాష్ట్ర రాజకీయాలను చూశా... ప్రపంచం మొత్తం తిరిగానన్నారు. కృష్ణా జిల్లా నా పుట్టినిల్లు.. విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా బరిలో దిగడాన్ని భగవంతుడి వరంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వ హయాంలో మన దేశ భద్రతాబలగాలు ఉగ్రవాదుల్ని వాళ్ల సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని గురువారం అన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.