సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈనెల 18న సాయంత్రం ఆయన హైదరాబాద్ కు రానున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొననున్నారు రాజ్‌నాథ్ సింగ్. ఇదిలా ఉంటే.. ఈ నెల 21న రాష్ట్రానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రానున్నారు. మెదక్, సికింద్రాబాద్…
గుంటూరు జిల్లాలోని ఏటుకురులో నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన సముద్రాన్ని చూస్తే మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ జన ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుంది.. ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తుంది.. మన ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు మంచినీ కొనసాగించేందుకు వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
PM Modi: బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, వీటిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల జీఎస్ గార్డెన్ లో నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1971లో దాయాది దేశం పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ మెడలు వంచింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బంగ్లాదేశ్ దేశాన్ని విభజన చేయకుండా ఉంటే పాకిస్తాన్ మన పక్కలో బల్లమై ఉంటుండే అని తెలిపారు. పాకిస్తాన్ ను ముక్కలు చేసి బంగ్లాదేశ్ తలెత్తకుండా రక్షణ…
Rajnath Singh: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
పొన్నం.. మీ పార్టీ మాట తప్పినందుకు గాంధీభవన్ వద్ద దీక్ష చెయ్యి.. కేసీఆర్ 10 ఏళ్లపాటు అరిగోస పెట్టినందుకు తెలంగాణ భవన్ వద్ద దీక్ష చెయ్యి.. 80 కోట్ల మంది పేదలకు మోడీ అన్నం పెడుతున్నందుకు.. కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.
ఈ పొత్తు సహితం కాదని కొంతమంది పనికిమాలిన మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదంగా భావిస్తున్నామని గన్నవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Annamalai: తమిళనాడులో పొలిటికల్ హీట్ పీక్స్‌కి చేరింది. అధికార డీఎంకే, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై అధికార డీఎంకేపై విరుచుకుపడ్డారు. డీఎంకే పార్టీని ‘దుష్టశక్తి’గా అభివర్ణించారు.
పదేండ్లు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై దీక్ష చేస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దీక్ష చేపడతామని తెలిపారు.